చంద్రబాబు తనయుడు లోకేష్ కి ఎట్టకేలకు అసెంబ్లీ స్తానం ఖరారు అయింది. కాగా లోకేష్ ను గుంటూరు జిల్లా మంగళగిరి నుండి పోటీకి దింపాలని అధిష్టానం నిర్ణయించింది. ఎలాగో లోకేష్ పోటీ చేసేది రాజధాని ప్రాంతం కావడంతో ఎలాగైనా లోకేష్ విజయం సాధించవచ్చని చంద్రబాబు అంచనా వేశాడు. కాగా గత ఎన్నికల్లో కేవలం 12 ఓట్ల తేడాతో విజయం సాదించినటువంటి వైసీపీ నేత ఆళ్ళ రామకృష్ణారెడ్డి ని ఓడించాలంటే లోకేష్ ని దింపడమే సరైన నిర్ణయమని చంద్రబాబు అనుకున్నారు. కాగా లోకేష్ కి ఉన్నటువంటి పలుకుబడి ప్రకారం తనని ఓడించాలని వైసీపీ అధినేత జగన్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారని సమాచారం దీంతో మంగళగిరిలో లోకేష్ కి పోటీగా ప్రముఖ నటుడు ఎన్టీఆర్ వాళ్ళ మామ నార్నె శ్రీనివాస్ ను బరిలోకి దింపనున్నారని సమాచారం. ముందుగా ఆ స్థానాన్ని ఉడుత శ్రీనుకు కేటాయించాలని అనుకున్నప్పటికీ తాజా పరిణాలమాల దృష్ట్యా మంగళగిరి స్థానాన్ని నార్నె శ్రీనివాసరావుకు అప్పగించారని సమాచారం. కాగా పరిస్థితులకు అనుగుణంగా వైసీపీ కూడా వ్యూహాలను మర్చి కొత్త పోకడలకు దారి తీస్తుందని తెలుస్తుంది. కాగా ఈ ఎన్నికల్లో మాత్రం అభ్యర్థుల్లో పోటీ గట్టిగానే ఉండనుందని సమాచారం
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa