విజయవాడ: విజయవాడ బెంజిసర్కిల్ సమీపంలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం సెంటర్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏటీఎం మెషిన్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తెచ్చారు. పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ పేలడంతో మంటలు వ్యాప్తిచెంది ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa