‘టైమ్స్ నౌ’ జరిపిన స్టింగ్ ఆపరేషన్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ- భారతీయ జనతా పార్టీ మధ్య బంధం బయటపడిపోయిన నేపథ్యంలో దీనిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఉదయం పలువురు టీడీపీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు.
బీజేపీ, వైసీపీ లాలూచీని ‘టైమ్స్ నౌ’ స్టింగ్ ఆపరేషన్ బయటపెట్టిందన్నారు. బీజేపీ అభ్యర్థులపై వైసీపీ బలహీన అభ్యర్థులను దించుతారని ఆ పార్టీ నేతే చెప్పారు. పలు కేసుల్లో ప్రధాన నిందితుడుగా ఉన్న జగన్‌ను బీజేపీ వాళ్లు దాసోహం చేసుకున్నారు. అక్కడేమో మోదీకి దాసోహైన ఆయన.. ఇక్కడ మాత్రం కేసీఆర్‌కు అయ్యారు. ఇలాంటి వైసీపీ రాష్ట్రానికి అవసరమా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు.ఆంగ్ల వార్తా చానల్ ‘టైమ్స్ నౌ’ జరిపిన స్టింగ్ ఆపరేషన్‌లో విజయవాడ నగర వైసీపీ అధికార ప్రతినిధి మనోజ్ కొఠారీ వైసీపీ, బీజేపీ మధ్య లాలూచీ రాజకీయం నడుస్తోందని ఒప్పుకున్న విషయం తెలిసిందే. బుధవారం దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో ఏపీ రాజకీయాల్లో కలకలం రేగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa