ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్నికల సంఘానికి రాజకీయాలు అపాదించొద్దు : ద్వివేది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 14, 2019, 10:52 AM

ఎన్నికల సంఘానికి రాజకీయాలు అపాదించొద్దని ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి గోపాల కృష్ణ ద్వివేది అన్నారు.  అమరావతిలో ఆయన మాట్లాడుతూ… ఎన్నికల సంఘానికి రాజకీయ పార్టీలతో సంబంధం లేదన్నారు. ఏ రాజకీయ పార్టీకి ఎన్నికల సంఘం కొమ్ము కాయదన్నారు.  ఎవరికి నచ్చిన అన్వయం వారు ఇచ్చుకోవద్దన్నారు. నిబంధనల ప్రకారమే ఎన్నికల సంఘం వ్యవహరిస్తుందని, ఎన్నికల ప్రక్రియ మీద విశ్వాసాన్ని దెబ్బతీసేలా ఎవరూ ప్రవర్తించవద్దన్నారు. 20వ తేదీలోపు ఫారం-7 దరఖాస్తులను క్లియర్ చేస్తామని తెలిపారు. 165 నియోజకవర్గాలలో దరఖాస్తుల పరిశీలన పూర్తయ్యిందని, ఎన్నికల ప్రక్రియలో సంఘానిది రిఫరీ పాత్ర మాత్రమే, ఎవరి పక్షాన పని చేయదన్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా 9,44,825 ఫారం-7 మొత్తం దరఖాస్తులు వచ్చాయని, 6,10,143 దరఖాస్తుల తిరస్కరణకు గురవ్వగా, 2,58,852 దరఖాస్తుల అమోదం పొందాయన్నారు. 


ఇప్పటి వరకు 1,42,408 డూప్లికేట్ ఓట్లను తొలగించామని, జిల్లా యంత్రాంగాల నుంచి క్షేత్ర స్థాయి నివేదికలు రాకుండా ఓట్ల తొలగింపు సాధ్యపడదన్నారు. ఫారం-7 దరఖాస్తులపై రాష్ట్ర వ్యాప్తంగా 440 కేసులు నమోదయ్యాయని, రాష్ట్ర వ్యాప్తంగా 30కోట్ల నగదు, 16కేజీల బంగారాన్ని పోలీసులు సీజ్ చేశారన్నారు. షెడ్యూల్ ప్రకటించిన తర్వాత కొత్త ఓట్ల కోసం 3,57,539 ఫారం -6 దరఖాస్తులు, మార్చి 15నాటికి పదిలక్షల దరఖాస్తులు రావొచ్చని అంచనా ఉందన్నారు. 2015-17 మధ్య వేర్వేరు సర్వేల్లో, వేర్వేరు కారణాలతో 25లక్షల ఓట్ల తొలగింపునకు గురయ్యాయని, 2014 ఓటర్లతో పోలిస్తే 2019లో గణనీయంగా ఓట్ల సంఖ్య తగ్గిందన్నారు. ఏపీలోని పట్టణ ప్రాంతాల్లో గణనీయంగా ఓట్ల తగ్గాయని ఎన్నికల అధికారి గోపాల కృష్ణ ద్వివేది తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa