ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో వైసీపీలోకి వలసలు ఊపందుకున్నాయి. పలువురు నేతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు వైసీపీలో చేరుతున్నారు. బుధవారం టీడీపీ పార్లమెంటరీ నేత, కాకినాడ ఎంపీ తోట నరసింహం, ఆయన భార్య తోట వాణి వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ తోట సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కోసం తాను ఎంతో చేశానని అలాంటిది ఆ పార్టీ తనను కనీసం గుర్తించలేదని వాపోయారు. టీడీపీలో అవమానం జరిగిందని అందుకే పార్టీని వీడి వైసీపీలో చేరానని తెలిపారు. తనకు ఆరోగ్యం బాగోలేనప్పుడు టీడీపీ కనీసం పరామర్శించలేదని ఆయన విమర్శించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యానని, అందుకే పార్టీని వీడుతున్నానని తోట నరసింహం పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విటర్ వేదికగా స్పందించారు. తోట నరసింహం ఆస్పత్రిలో ఉన్నప్పుడు టీడీపీ నేతల పరామర్శించిన ఫోటోలను విడుదల చేశారు. ఆ సమయంలో లోకేష్ తోపాటు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు. మెుత్తానికి ఎంపీ తోట నరసింహం ఆరోపణలకు టీడీపీ ఆధారాలతో సహా దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa