ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మత్స్యకారులకు రాహుల్ శుభవార్త

national |  Suryaa Desk  | Published : Thu, Mar 14, 2019, 02:01 PM

దేశవ్యాప్తంగా మత్స్యకారులందరికీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ  శుభవార్త చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే మత్స్యకారుల కోసం ప్రత్యేకంగా ఓ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీలా తాను ‘‘మోసపూరిత హామీలు’’ ఇవ్వబోనని రాహుల్ స్పష్టం చేశారు. కేరళలోని త్రిస్సూర్‌లో ఇవాళ అఖిల భారత మత్స్యకారుల మహాసభ నిర్వహించిన జాతీయ మత్స్యకార ప్రతినిధుల సమావేశంలో రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగించారు.


 


‘‘2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన మరుక్షణమే, దేశంలోని మత్స్యకారులందరికీ ఢిల్లీ కేంద్రంగా సొంతంగా ఓ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తాం...’’ అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ హామీ నెరవేర్చి తీరతామని పేర్కొన్న రాహుల్... ప్రధాని మోదీపైనా తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ‘‘నేను నరేంద్రమోదీలా కాదు.. మోసపూరిత హామీలు ఇవ్వబోను. నా ప్రసంగాలను ఒకసారి పరిశీలించండి. నేను ఏదైనా చెబితే.. దాన్ని చేయాలని నిర్ణయించుకున్న తర్వాతే చెబుతాను...’’ అని రాహుల్ స్పష్టం చేశారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa