ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మా కాలనీలో ఓట్లు అడగడానికి రావ‌ద్దు....

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 14, 2019, 02:21 PM

 ఓటరు కి రాజకీయాలను శాసించే దమ్మువుందన్న ది వాస్త‌వం.  ప్ర‌జాస్వామ్యంలో ఎన్నికలలో   గెలిచినవాళ్లదే రాజ్యం అని చెప్పాలి.  ఐదేళ్ల వరకు  వాళ్లు మ‌హ‌రాజులే అయినా ప్ర‌జ‌ల‌ను పాలించేందుకు  ఓట్లు కోసం నేతల ఎన్నిక‌ల‌లో ప్రలోభాలకు తెర‌తీయ‌టం మామూలే. వాటికి లొంగి తమ ఓటును  ఓటర్లు దుర్వినియోగం చేసుకుంటార‌న్న అప‌ప్ర‌ద లేక‌పోలేదు. అయితే ఇందుకు భిన్నంగా  తమను ఓట్లు అడగవద్దని, అడగాలనుకున్నవాళ్లు తమ కాలనీలోని పలు అవసరాలు తీరిస్తేనే  ఓట్లు వేస్తామని ఫ్లెక్సీ కూడా పెట్టిన ఘ‌ట‌న  గోదావరి జిల్లా మలికిపురం మండలం తూర్పుపాలెంలోని గవర్నమెంట్‌ కాలనీ(ముత్యాలవారి కాలనీ) లో జ‌రిగింది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. 


ఈ గవర్నమెంట్‌ కాలనీ ఏర్పడి 35 ఏళ్లు గ‌డుస్తున్నా,  క‌నీస అవ‌స‌రాలైన రోడ్లు  తాగునీరు, విద్యుత్తు సౌకర్యాలు లేక‌పోవ‌టం నిత్యం ఓట్లు అందుకు త‌మ స‌మ‌స్య‌ల‌పై స్పందించ‌ని   నాయకుల నిర్లక్ష్యంకు నిర‌స‌న వ్య‌క్తం చేస్తూ,   ఈ సారి ఎన్నిక‌ల‌లో ఓట్లు వేయకూడదని నిర్ణయించుకున్నారు.  దీంతో ‘రాజకీయ పార్టీల నాయకులు ఓట్లు అడగడానికి దయచేసి మా కాలనీకి రావొద్దు. మా విలువైన సమయాన్ని వృథా చేయొద్దు’ అంటూ ఫ్లెక్సీని ఏర్పాటు చేయ‌టంతో పాటు త‌మ . కాలనీలో తామెదుర్కొంటున్న‌ దుస్థితి పై ఫోటోలతో కూడిన ఫెక్సీల‌పై 70 మంది కాలనీవాసుల సంతకాలు కూడా వుంచారు. దీంతో ఒక్క‌సారిగా ఈ గ్రామంపై మీడియా ఫోక‌స్ ప‌డింది. ఈ సారైనా ఈ గ్రామ‌స‌మ‌స్య‌లు తీరుతాయేమో చూద్దాం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa