పరీక్షలు బాగా రాశామని మందు తాగుతారు.. పరీక్షల్లో పాస్ అయ్యామని మందు తాగుతారు.. ఒక వేళ ఫెయిల్ అయినా ఇదే పని.. లవ్‌లో పడ్డా తాగడమే.. లవ్ సక్సెస్, ఫెయిల్ అయినా తాగడమే.. పెళ్ళిళ్లు అయినా.. చావు కబురైనా ఇలా కాదేదీ తాగేందుకు అనర్హమన్నట్లు చాలామంది యువకులు పెగ్గు మీద పెగ్గు వేస్తుంటారు. ఊగుతూ.. తూలుతూ హాయిగా ఎంజాయ్ చేస్తుంటారు. అయితే.. ఇదంతా ఇప్పుడు బానే ఉంటుంది. 60ఏళ్లు వచ్చాక కానీ దాని దుష్ప్రభావాలు కనిపించవని చెబుతున్నాయి పరిశోధనలు.యవ్వనంలో ఎక్కువగా తాగి అరవై ఏండ్ల వయస్సులో ఉన్నవారిని పరిశోధనలు జరిపారు. ఇందులో మందుతాగే అలవాటు లేనివారికి రెండు వ్యాధులుసోకితే, మందు తాగే అలవాటున్నవారికి మూడు అంతకన్నా ఎక్కువ వ్యాధులున్నట్లు తేలింది. కాబట్టి.. పెగ్ మీద పెగ్ వేసి ఎంజాయ్ చేస్తున్న యువకుల్లారా కాస్తా ఆలోచించండి.. అతిగా తాగకండని చెబుతున్నారు పరిశోధకులు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa