2014 లో శ్రీకాకుళం MLA గా భారీ మెజారిటీతో ఘనవిజయం సాధించిన గుండ లక్ష్మీదేవికి మరోమారు అవకాశం దక్కడంపై హర్హాతిరేకాలు వ్యక్తమవుతున్నాయిఈ సందర్భంగా పట్టణ తెలుగుదేశం పార్టీ సారధ్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గౌరవ టిడిపి జాతీయ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబునాయుడు గారికి నగర తెలుగుదేశం పార్టీ ధన్యవాదాలు తెలుపుతు తీర్మానం ఆమోదించింది. , అనంతరం నీతి నిజాయితీ ద్వారా శ్రీకాకుళం ఖ్యాతి రాష్ట్ర వ్యాపితం గా మారుమోగించిన 20 సంవత్సరాలు శ్రీకాకుళం MLA గా తన అమూల్యమైన సేవలందించిన మాజీమంత్రివర్యులు గౌరవ గుండ అప్పలసూర్యనారాయణ గారిని గౌరవ MLA గుండ లక్ష్మీదేవి గారిని గజమాలతో కార్యకర్తలు సత్కరించారు. ఎన్నడూ లేని విధంగా నిరంతరం ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ వచ్చానని, ఇందుకు ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు, కార్యకర్తలు నియోజకవర్గ ప్రజల సంపూర్ణ సహకారం తో నియోజకవర్గాన్ని , ముఖ్యంగా, నగరాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయటంతో పాటు, పార్టీలకు అతీతంగా అర్హులైన అందరికి సంక్షేమ కార్యక్రమాలను అందించగలిగానని శ్రీకాకుళం MLA గుండ లక్ష్మీదేవి అన్నారు. మళ్ళీ 2 వ సారి శ్రీకాకుళం నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన ఆమె. రానున్న ఎన్నికలలో పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్నాయుడుని సైతం భారీ మెజారిటీ తో గెలిపించుకునేందుకు , మళ్ళీ ముఖ్యమంత్రిగా నారాచంద్రబాబు నాయుడు చెయ్యడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, క్యాడర్ ఈ 27 రోజులు శ్రమించి పనిచేయాలని ఆమె పార్టీ క్యాడర్ కు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమం లో నగర పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్ , 50 డివిజన్ల ఇన్చార్జిస్ , మహిళా నాయకులు నగర పార్టీ ,క్యాడర్ , యూత్ CBN army, పాల్గొన్నారు. అనంతరం నగరం లో కొంతమంది వైశ్య ప్రముఖులు , వ్యాపారులు మహిళలు పార్టీ లో భారీ ఎత్తున్న వారికీ పార్టీ కండువాలు వేసి గుండ దంపతులు ఆహ్వానించారు..
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa