టిటిడిలో కొత్తవి, వినియోగించినవి, పాక్షికంగా దెబ్బతిన్నవాచీలను మార్చి 15న ఈ-వేలం వేయనున్నట్టు తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారి ఓ ప్రకటనలో తెలిపారు. ఆలయ ఇవో తరపున విడుదలైన ఈ ప్రకటనలో విశాఖపట్నంకు చెందిన ఎమ్.ఎస్.టి.సి. లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ - వేలం జరుగనుంది. ఇందులో క్యాషియో, టైమెక్స్, ఆల్విన్, టైమ్స్, సొనాట, టిస్సాట్, ఫాస్ట్‌ట్రాక్ తదితర కంపెనీల వాచీలున్నాయన్నారు. తర వివరాలకు తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్(వేలం) కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో కార్యాలయం వేళల్లో, టిటిడి వెబ్‌సైట్ www.tirumala.org, ఎమ్.ఎస్.టి.సి. లిమిటెడ్ వెబ్‌సైట్ www.mstcecommerce.com /www.mstcindia.co.in ను సంప్రదించవచ్చని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa