ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 14, 2019, 08:38 PM

నేను ఇవ్వడానికే రాజకీయాల్లోకి వచ్చాను తప్ప తీసుకోవడానికి రాలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇవ్వాళ రాజమహేంద్రవరంలో జరిగిన యుద్ధ శంఖారావంలో పవన్ ప్రసంగించారు. ధర్మాన్ని రక్షించేవాడు, అన్యాయాన్ని ఎదిరించేవాడు రెడ్డి అన్నారు. కమ్మ, కాపు, వెలమల్లో నాయుడు ఉందన్నారు. కులాలను వాడుకుని కుటుంబాలు ఎదుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో రెండు కులాలే రాజ్యమేలుతున్నాయి. రాష్ట్రంలో బీసీలకు అండగా నిలిచిన పార్టీ జనసేన అని అన్నారు. మనుషుల్ని భావజాలంతో ఐక్యం చేయాలన్నారు. సాగు సాయం కింద ఎకరాకు రూ.8 వేల సాయం అందచేస్తాను. 60 ఏళ్లు నిండిన సన్నకారు రైతుకు రూ.5 వేల చొప్పున ఫించన్ మంజూరు చేస్తామన్నారు. భూములు కోల్పోయిన రైతులను పారిశ్రామీకీకరణలో భాగస్వామ్యం చేసి, లబ్ధి కలిగేలా చూస్తామన్నారు. ఉభయ గోదావరి జిల్లాలో రూ.5వేల కోట్లలో గ్లోబల్ మార్కెట్ ఏర్పాటు చేస్తాం. రైతులకు సోలార్ మోటార్లు పంపిణీ చేస్తామని, ప్రతి జిల్లాల్లో నదులను అనుసంధానం చేస్తాం. కేజీ టు పీజీ వరకు ఉచిత విద్యనందిస్తామని, ఉచిత బస్సు సౌకర్యం, ఐడీ కార్డు చూపిస్తే కాదు క్యాంటిన్ లో ఉచిత భోజనం కల్పిస్తాం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో డిగ్రీ కాలేజీ, వ్యవసాయ, పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కులాలతో సంబంధం లేకుండా అందరూ ఏడాదికి ఒకసారి ఫీజులు చెల్లిస్తే చాలు, అన్ని పరీక్షలు రాయవచ్చన్నారు. తోపుడు బండ్ల వ్యాపారులు, చిరు వ్యాపారులకు అండగా ఉంటామని, ఏ విధమైన పూచికత్తు లేకుండా పావలా వడ్డీతో రూ.5వేల రుణాలు మంజూరు చేస్తామన్నారు. ఎవరూ వేధించకుండా ఉండేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకువస్తాం. ప్రభుత్వ ఉద్యోగుల కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్ధు చేసి, అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తాం. బీసీలకు 5 శాతం రాజకీయ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణపై ఇరువర్గాలను కూర్చోబెట్టి సామరస్య పరిష్కారం కనిపెడ్తామన్నారు. ముస్లింలకు ఏం చేయడం లేద‌ని, రాజేంద్ర సచార్ కమిటీ సిఫారసులు అమలు చేయడం లేద‌న్నారు .
రాష్ట్రంలో అడ్డగోలుగా దోచుకుంటుంటే చూస్తుంటామా, అంబేడ్కర్, మహాత్మాగాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఇలా చేస్తారా అని ప్రశ్నించారు. మీ అందరి ఆవేదన పవన్ కళ్యాణ్ నోటి వెంట వస్తున్నాయని, నా వ్యక్తిగత ఆరోపణలు కాదన్నారు. జన్మభూమి కమిటీలతో జనం విసిగి వేశారిపోయారు. నాకు లోకేష్ బాబు, జగన్ బాబు మీద వ్యక్తిగత కోపం లేదని, విధానపరంగానే విమర్శించాను. పేదవాడికి అన్యాయం చేస్తే వదలను, తాటతీస్తానన్నారు. డబ్బు మీద నాకు వ్యామోహం లేదు, ఎన్ని వేల కోట్లు కావాలి, ఎంత తింటామన్నారు. ప్రజలు పెద్దగా కోరుకోవడం లేదని, తాగునీరు, సాగునీరు, వైద్యం, విద్య కల్పించాలని కోరుతున్నారు. నిరుద్యోగులు తమకు ఉద్యోగాలు కావాలని తన పర్యటనలో డిమాండ్ చేశారన్నారు. వారి డిమాండ్ల మేరకు జనసేన మేనిఫెస్టో రూపొందించామని చెప్పారు ప‌వ‌న్‌.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa