ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ తీర్థం పుచ్చుకున్న‌ దాసరి అరుణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 14, 2019, 08:30 PM

దివంగత సినీ దర్శకులు దాసరి నారాయణరావు కుమారుడు అరుణ్‌ గురువారం వైసీపీ అధ్యక్షులు జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఆయనపై పార్టీ కండువా కప్పిన జగన్ సాదరంగా ఆహ్వానించారు. తరువాత దాసరి అరుణ్‌ మీడియాతో మాట్లాడారు. వైసీపీ సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చి పార్టీలో చేరానన్నారు. జగన్‌ ఆదేశిస్తే ప్రచారం చేస్తానని తెలిపారు. మా నాన్న దాసరి నారాయణరావు బతికి ఉంటే వైసీపీ నుంచి పోటీ చేసేవారన్నారు. కాగా ఇప్పటికే హాస్యనటుడు అలీ చేరిన విషయం విదితమే. ఏపీలోని ప్రతిపక్ష పార్టీకి టాలీవుడ్ సినీ పరిశ్రమ నుంచి మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే పోసాని - కృష్ణ భగవాన్ వైసీపీలో చేరగా.. ఇటీవలే హాస్యనటులు అలీ - కృష్ణుడు వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు టాలీవుడ్ గర్వించే దిగ్గజ దర్శకుడు దాసరి కుమారుడు వైసీపీకి మద్దతుగా ప్రచారానికి ముందుకు రావడం విశేషం. దాసరి నారాయణ రావు.. వైఎస్ హయాంలో కేంద్రంలో మంత్రిగా చేశారు. కాంగ్రెస్ లో వెలుగు వెలిగారు. ఆ తర్వాత మరణించే వరకూ కూడా కాంగ్రెస్ లోనే కొనసాగారు. ఇప్పుడు ఆయన కుమారుడు వైసీపీ బాట పట్టడం విశేషం. 


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa