ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్రమ మద్యంపై నిఘా పెరిగేనా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 14, 2019, 10:47 PM

ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నాయకుల‌కు మద్యం ఆయుధమని రాజకీయ విశ్లేషకులంటున్నారు. ఇలాంటి వాటిపై ఎక్సైజ్‌ శాఖ గట్టి నిఘా ఉండాలంటున్నారు. మద్యం దుకాణాల్లో ఎప్పటికప్పుడు పాత అమ్మకాలు, ప్రస్తుతం జరుగుతున్న విక్రయాల‌పై ఆరా తీయాలంటున్నారు. బెల్టు షాపు, ఇతర రాష్ట్రాల‌ నుంచి వచ్చే పన్ను కట్టని మద్యం, నాటుసారా, కల్తీ మద్యం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. ఇప్ప‌టి పరిస్థితిలో చర్యపై ఎక్కువ దృష్టిపెట్టిందనే విమర్శ‌లు వినిపిస్తున్నాయి. సిబ్బందిని నివేదికల‌కే పరిమితం చేసి క్షేత్రస్థాయిలో నిఘాను గాలికొదిలేశారంటున్నారు. ఎన్నికల‌ కోడ్ అమలులో ఉన్నంత కాలం ప్రతి స్టేషన్‌ నుంచి ఎక్సైజ్‌ సిబ్బంది అధికారుల‌కు నివేదిక‌లు పంపాలి. ఒక షాపు గతేడాది ఇదే సమయానికి ఎంత అమ్మింది. ఇప్పుడు ఎంత అమ్మింది అనే వివరాలు రోజువారీగా చేరవేయాలి. వీటిని ఆన్‌లైన్‌లో ప్రతిరోజూ ఉదయం 8కల్లా పంపించాల‌న్నది అధికారు ల‌ఆదేశం. వాస్తవానికి మద్యం షాపు రాత్రి 10 గంటల‌ వరకూ, బార్‌లు రాత్రి 11 గంట వరకూ పనిచేస్తాయి. ఆ తర్వాత గంటకు ఆ రోజు అమ్మకా వివరాల‌ను ఎక్సైజ్‌ సిబ్బందికి ఇస్తారు. ఒక్కో స్టేషన్‌ పరిధిలో మద్యం షాప్‌లు, బార్‌లు సగటున 20 వరకూ ఉంటాయి. వివరాు అప్‌లోడ్‌ చేయడానికి ఉద్దేశించిన వెబ్‌సైట్‌ రాత్రి 12 గంట తర్వాత ఓపెన్‌ అవుతుంది. అప్పటి నుంచి తెల్ల‌వారే వరకూ ఆ నివేదిక‌కు రూపొందించడమే సిబ్బందికి పెద్ద పని. కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు ఆ వివరాలు 6 గంటల‌కే పంపాల‌ని ఆదేశిస్తున్నారు. ఒక్కో షాప్‌నకు 8 రకాల‌ వివరాల‌ చొప్పున 80 ఎంట్రీలు నమోదు చేయాలి. ఉదాహరణకు గుంటూరునే తీసుకుంటే 60 మద్యం షాప్‌లు, బార్‌లు ఉన్నాయి. వీటికి రాత్రంతా కలిసి 500 రకాల‌ వివరాలు నింపి సిబ్బంది నివేదిక‌ల‌కు సిద్ధం చేస్తున్నారు. సీఐ నుంచి కానిస్టేబుల్‌ వరకూ ఇతరత్రా పనున్నీ వదిలేసి ఈ పనిలోనే ఉంటున్నారు. ఈ క్రమంలో అస‌లు బెల్టు షాపు వైపు చూసేవారే కరువయ్యారు. నిఘా విషయంలో ఎక్సైజ్‌ యంత్రాంగం విఫల‌మవుతోందనుకుంటున్నారు. చెక్‌పోస్టు, సెంట్రీ డ్యూటీ మినహాయిస్తే ముగ్గురు, న‌లుగురు కానిస్టేబుళ్లు మాత్రమే ఉంటున్నారు. వీరిపని నివేదిక‌లు సిద్ధం చేయడమే. అందుకే కొంత వెసులుబాటు కల్పించాల‌ని ఎక్సైజ్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారుల‌ సంఘం అధ్యక్షుడు బి.నర్సింహులు కమిషనర్‌ మీనాకు వినతిపత్రం సమర్పించారు. ఎమ్మార్పీ ఉల్లంఘన‌లు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఎన్నిక‌లు కావడంతో ఇష్టారాజ్యంగా అదనపు వసూళ్లకు పాల్ప‌డుతున్నారు. కోస్తాలోని కొన్ని జిల్లాల్లో ఈ ఉల్లంఘన‌లు ఎక్కువగా ఉన్నాయి. ఒక్కో సీసాపై రూ.10 నుంచి రూ.20 అదనంగా తీసుకుంటున్నారు. ఈ విషయంలో ఇటీవల న‌లుగురు సీఐల‌ను సస్పెండ్‌ చేశారు. ఈ వ్యవహారాల‌కు కమిషనర్‌ కార్యాయంలోనే కొందరు సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెల‌వారీ మామూళ్లు వసూలు చేసి వాటిని జిల్లాస్థాయి సిబ్బంది, కమిషనరేట్‌లోని అధికారులు పంచుకుంటున్నారని ఎక్సైజ్‌ వర్గాల‌ ఆరోపణ. కొత్తగా వచ్చిన కమిషనర్‌ ఎంకే మీనా ఎన్నికల‌పై దృష్టిపెట్టడంతో దీనిని అదనుగా చూసుకుని ఆ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa