మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడిగా ఆయనతో పాటే రాజకీయాలలోకి వచ్చిన వివేకానందరెడ్డి పులివెందుల నుంచి 1989, 1994 లో ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలుపొందిన ఆయన 1999లో కడప ఎంపీగా రంగంలోకి దిగి గెలిచారు. ఆపై. 2004లో కూడా ఎంపీగా గెలిచిన ఆయన రాజీనామా చేసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు వైఎస్ జగన్ రాజకీయ రంగ ప్రవేశంకు వీలు కలిపించారు. ఇక్కడ జరిగిన ఉప ఎన్నికలో నాడు జగన్ గెలిచారు. ఆపై 2009లో జగన్ కడప ఎంపీగా గెలిచేందుకు సహకరించిన వివేకా ఎమ్మెల్సీ పదవి అందుకున్నారు. అయితే అదే ఏడాది వైఎస్ హఠాన్మరణం ఆతన్ని కృంగదీసింది. అటు కుటుంబానికి బాసటగా ఉంటునే, ఇటు కాంగ్రెస్‌లో కీలకంగా మారారు. 2010లో కిరణ్‌కుమా రెడ్డి మంత్రివర్గంలో వివేకా వ్యవసాయ శాఖ మంత్రి గా బాధ్యతలు నిర్వహించారు. ఈ సమయంలోనే సిఎం పదవి వారసత్వంగా ఇవ్వలేదని కాంగ్రెస్‌కు జగన్ గుడ్‌బై చెప్పి సొంత పార్టీ పెట్టుకున్నారు. జగన్‌కు మద్దతుగా కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పినా . వైఎస్ వివేకా కాంగ్రెస్‌ను వీడలేదు. తమ కుటుంబానికి రాజకీయబిక్షపెట్టిన పార్టీలో కొనసాగుతానని చెప్పారు. అంతే కాదు 2011లో వచ్చిన ఉప ఎన్నికల్లో పులివెందులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయమ్మ పోటీ చేయగా కాంగ్రెస్ నుంచి వైఎస్ వివేకానందరెడ్డి బరిలోకి దిగటం విశేషం. అయితే ఆ ఉప ఎన్నికల్లో వివేకా అనూహ్యంగా పరాజయం పాలయ్యారు. ఇక కాంగ్రెస్‌లోనూ తన పరిస్థితి అంతంతగా మారటంతో అనంతర పరిణామాల నడుమ ఆయన జగన్ పార్టీలో చేరిపోయారు. ప్రస్తుతం వైఎస్సార్‌సి తరపున ఎన్నికల కదన రంగంలో పులివెందులలో ప్రచారబాధ్యతలు భుజానకెత్తుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa