ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మసీదు లోపలకు వచ్చి కాల్పులు..

international |  Suryaa Desk  | Published : Fri, Mar 15, 2019, 09:34 AM

న్యూజిలాండ్‌ సెంట్రల్ క్రైస్ట్‌చర్చ్‌ నగరంలోని ఓ మసీదులో గుర్తు తెలియని ఆగంతుకుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ సంఘటనలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడినట్లు స్థానిక మీడియా తెలిపింది. నల్లరంగు దుస్తులు ధరించిన ఓ వ్యక్తి అల్ నూర్ మసీదు లోపలకు వచ్చి కాల్పులు జరిపాడు. కాల్పులకు తెగబడిన వ్యక్తిపై భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరుపుతున్నారు. క్షతగాత్రుల్ని అంబులెన్సులో స్థానిక ఆసుపత్రులకు తరలిస్తున్నారు. నగరంలోని ప్రజలు ఎవరూ బయటికి రావద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ దాడితో భయభ్రాంతులకు లోనైన సమీప ప్రజలు అక్కడి నుంచి పరుగులు తీశారు. మసీదులో పలు మృతదేహాలు పడి ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.


టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జట్టుతో మూడో టెస్టు ఆడనున్న బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు దాడి సమయంలో ఆ ప్రాంతంలోనే ఉండడం గమనార్హం. అదృష్టవశాత్తూ వారు ఈ దాడి నుంచి తప్పించుకున్నారు. తాము సురక్షితంగా తప్పించుకున్నట్లు క్రికెటర్‌ తమీమ్‌ ఇక్బాల్‌ ట్వీట్‌ చేశాడు.  ‘‘దాడి నుంచి మొత్తం జట్టు తప్పించుకుంది. ఇది భయంకరమైన అనుభవం. మీ అందరి ఆశీస్సులే మమ్మల్ని కాపాడాయి’’ అని తమీమ్ పేర్కొన్నాడు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa