ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు తిరుమల రానున్న చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 15, 2019, 10:32 AM

తిరుమల :  శ్రీవారి దర్శనార్థం ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం తిరుమల రానున్నారు. ఉదయం తిరుమలలోని పద్మావతి విశ్రాంతి గృహానికి చేరుకుని కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం స్వామిని దర్శించుకుని తిరుపతికి బయలుదేరతారు. తొలుత శుక్రవారం సాయంత్రానికే తిరుమల రావాల్సిన చంద్రబాబు పర్యటన ఆ తర్వాత శనివారానికి వాయిదా పడింది. సీఎంతో పాటు మంత్రి లోకేశ్‌, కొందరు మంత్రులు, నాయకులు కూడా వస్తున్నట్లు సమాచారం. శ్రీవారి దర్శనానంతరం టీడీపీ సేవామిత్రలు, బూత్‌ కన్వీనర్లు, ఏరియా కో-ఆర్డినేటర్లతో పార్టీ అధినేత సమావేశమవుతారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa