సిఎం దగ్గరే తేల్చుకుందామంటున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులను బుజ్జగించడం టిక్కెట్టు దక్కని నేతలకు తలనొప్పిగా మారుతోంది. జమహేంద్రవరం సిటి, రాజమహేంద్రవరం రూరల్, అనపర్తి ఇలా అసెంబ్లీ, రామండ్రి లోక్‌సభ స్థానాల్లో ఏది కేటాయించినా పోటీకి సిద్ధంగా ఉన్నట్లు చెప్పిన గుడా చైర్మన్ గన్నికృష్ణకు తాజా జాబితాలో దేనిలోనూ టిక్కెట్ దక్కకపోవటం పట్ల కేడర్ అసంతృప్తికి గురయ్యంది. శుక్రవారం ఉదయం తన నివాసంలో కార్పొరేటర్లు, నాయకులతో సమావేశమైన గన్ని కృష్ణ, ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను వివరించారు. రెండు చట్టసభల్లో దేనికైనా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చంద్రబాబుకు తెలిపానని, అయితే రాజకీయంగా కొన్ని అనివార్యాల వల్ల తనకు సీటు కేటాయించలేకపోయినట్టు కనిపిస్తోందనికృష్ణ తెలిపారు. తనని చంద్రబాబు గౌరవంతోనే చూసుకున్నారని, తన విషయంలో అన్యాయం జరిగినట్టు భావిస్తున్న పార్టీ శ్రేణులు ఓపిక పట్టాలని విన్నవించారు. కాగా రాజమహేంద్రవరం సిటి, రాజమహేంద్రవరం రూరల్, అనపర్తి నియోజకవర్గ నేతల పెద్ద ఎత్తున హాజరైన కీలక సమావేశంలో పలువురు పార్టీకి రాజీనామాచేసి వైసిపిలో చేరాలన్న ప్రతిపాదనలు తీసుకువచ్చినట్టు తెలుస్తోంది. అయితే చంద్రబాబు తుది నిర్ణయం తీసుకున్నాక సహకరించాల్సిన బాధ్యతమనమీద ఉందని గన్ని కృష్ణ అన్నట్టు సమాచారం
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa