అమరావతి : రేపటి నుంచి ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. వరుసగా ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. ఎన్నికల ప్రచారానికి ముందు చంద్రబాబు కార్యకర్తలతో సమావేశమవుతారు. రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు తిరుపతిలో సేవామిత్ర, బూత్ కమిటీల కార్యకర్తలతో సమావేశమవుతారు. 17న విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో ఎన్నికల సభల్లో పాల్గొంటారు. 18న నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, జిల్లాల్లో జరిగే సభల్లోనూ, 18న కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో జరిగే సభల్లోనూ చంద్రబాబు పాల్గొంటారు. సభలు ముగిసిన తరువాత చంద్రబాబు బస్సు యాత్ర చేపడతారు. చంద్రబాబు బస్సు యాత్రకు టిడిపి నేతలు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. రేపు సాయంత్రం శ్రీకాకుళంలో ఎన్నికల సభలో పాల్గొంటారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa