తాము ఎంచుకున్న రంగంలో విజయం సాధించి.. ఎంతో మందికి మార్గదర్శులుగా నిలిచే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాను ప్రముఖ మ్యాగజైన్ ట్రైమ్ ఏటా రూపొందిస్తుంది. ఈ ఏడాది జాబితాలో రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి, నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ నుంచి టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ వరకు ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖులకు చోటు దక్కింది. అయితే, ఆశ్చర్యకరంగా ఈ జాబితాలో భారత్ నుంచి ఎవరూ లేకపోవడం గమనార్హం. గతంలో పలుసార్లు భారతీయులు ఈ జాబితాలో చోటుదక్కింది. 2024లో బాలీవుడ్ నటి అలియా భట్, ఒలింపిక్ పతక విజేత రెజ్లర్ సాక్షి మాలిక్‌లకు ఈ జాబితాలో ఉన్నారు.
టైమ్ మ్యాగజైన్ లీడర్స్', 'ఐకాన్స్', 'టైటాన్స్' వంటి విభాగాలుగా విభజించి.. జాబితాను రూపొందించింది. అయితే 'లీడర్స్' విభాగంలో ఈ ఏడాది భారత సంతితకి చెందిన అమెరికన్ రేష్మా కేవలరామణికి చోటు దక్కింది. అమెరికాలోని వేర్‌టెక్స్ ఫార్మాస్యూటికల్స్ సీఈఓగా పని చేస్తోన్న ఆమె.. 11 ఏళ్ల వయసులో తల్లిదండ్రులతో కలిసి భారత్ నుంచి అగ్రరాజ్యానికి వలస వెళ్లారు. అమెరికాలో ఒక పెద్ద పబ్లిక్ బయోటెక్నాలజీ కంపెనీకి సీఈఓగా నియమితులైన మొదటి మహిళ ఆమే కావడం విశేషం.
రేష్మా కేవలరామణిపై టైమ్ మ్యాగజైన్‌లో ప్రొఫైల్ రాసి రచయిత జేసన్ కెల్లీ ‘‘రేష్మా నా బోర్డులో (Ginkgo Bioworks) సభ్యురాలిగా ఉన్నారు. ఆమె సూచనలు అమూల్యంగా నిలిచాయి. సైన్స్ పరిమితులను అధిగమిస్తూ డ్రగ్ అప్రూవల్ ప్రక్రియను నావిగేట్ చేయడంలో ఆమెకు అపార జ్ఞానం ఉంది. మీరు ఏదైనా కొత్తగా ప్రయత్నిస్తుంటే అది పిచ్చిగా లేదా అసాధ్యంగా అనిపిస్తే కూడా క్షమించదగినదే, ఎందుకంటే అంతవరకు దానిని ఎవరూ అది చేయలేనిది’’ అని పేర్కొన్నారు.
అలాగే, ‘‘ఆమె నాయకత్వంలో వెర్టెక్స్ సంస్థ క్రిస్పర్ ఆధారిత చికిత్సకు ఎఫ్‌డీఏ ఆమోదం పొందింది. ఇది జన్యుపరమైన లోపాలను సరిచేసి.. సికిల్ సెల్ వ్యాధిని నయం చేసే చికిత్స. రాబోయే కాలంలో మన శరీర డీఎన్ఏ భాషతో సంభాషించే ఔషధాలే దీనికి మార్గం కానున్నాయి.. అలాంటి భవిష్యత్తును సాధించగల నాయకురాలు రేష్మానే’ అని జేసన్ కెల్లీ కొనియాడారు. ఆమె సమర్ధతను, ప్రతిభను శ్లాఘించారు.
ఈ ఏడాది ‘లీడర్స్’ విభాగంలో చోటు దక్కిన ఇతర ప్రముఖుల్లో ఇంగ్లాండ్ ప్రధాని కియర్ స్టార్మర్, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత, నోబెల్ విజేత ముహమ్మద్ యూనస్, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తదితరులు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa