ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పీఏ వ్యవస్థ ఉండదు: మంత్రి లోకేశ్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 15, 2019, 07:18 PM

 తెలుగు దేశం పార్టీ ఐటీ శాఖమంత్రి నారా లోకేశ్ శుక్రవారం తాను పోటీచేసే నియోజకవర్గం మంగళగిరిలో మాట్లాడారు. తన వద్ద పీఏ వ్యవస్థ ఉండదని, అందరి ఫోన్‌ కాల్స్‌కు, మెసేజ్‌లకు తాను సమాధానం ఇస్తానని  లోకేశ్‌  అన్నారు.  కార్యకర్తలు, ప్రజలకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, కొందరు నేతలు కులాల ప్రస్తావన తెస్తున్నారని, కొందరు రేపు మతాన్ని, ప్రాంతాన్ని కూడా తీసుకొస్తారని విమర్శించారు. మన కులం మంగళగిరి, మన మతం మంగళగిరి, మన ప్రాంతం మంగళగిరి అని అన్నారు. పార్లమెంటులో మోదీ పేరు ప్రస్తావించాలంటేనే చాలామంది భయపడతారని, అలాంటిది  తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌ లోక్‌సభలో  మిస్టర్‌ ప్రైమ్‌మినిస్టర్‌ అని మాట్లాడారని గుర్తుచేశారు. మచ్చలేని కుటుంబాలపై కుట్రలు పన్ని కేసులు పెడుతున్నారని లోకేశ్‌ ఆరోపించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa