ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైకోర్టుకు పూర్తిగా వసతులు కల్పించండి:సిఎస్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 15, 2019, 07:20 PM

తుళ్లూరు మండలం నేలపాడులోఈనెల 18వతేదీ నుండి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తన కార్యకలాపాలను కొనసాగించనున్న నేపధ్యంలో అక్కడ అవసరమైన అన్ని సౌకర్యాలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠ సిఆర్డిఏ,ఐటి తదితర శాఖల అధికారులను ఆదేశించారు.ప్రస్తుతం విజయవాడ నుండి పనిచేస్తున్న రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం(హైకోర్టు) ఈనెల 18వతేది నుండి నేలపాడులో నిర్మించిన జుడీషియల్ కాంప్లెక్సు భవనం నుండి తన కార్యకలాపాలను ప్రారంభించనున్న నేపధ్యంలో అక్కడ కల్పించిన సౌకర్యాలు,ఇంకా కల్పించాల్సిన సౌకర్యాలపై శుక్రవారం అమరావతి సచివాలయంలో హైకోర్టు రిజిష్ట్రార్లు,సిఆర్డిఏ, ఐటి తదితర శాఖల అధికారులతో సమీక్షించారు.ఈసందర్భంగా సిఎస్ పునేఠ మాట్లాడుతూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అంటే అత్యంత గౌరవ ప్రదమైన మరియు ప్రతిష్టాత్మక వ్యవస్థని కావున దాని నిర్వహణకు సంబంధించి ఎవరకీ ఎలాంటి ఇబ్బందులు లేనివిధంగా తగిన వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.రాష్ట్ర విభజన నేపధ్యంలో హైదరాబాదులో ఉన్న ఉమ్మడి ఉన్నత న్యాయ స్థానాన్ని విభజించి ఎపికి ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావించి ఆప్రకారం గత డిశంబరులో అందుకు సంబంధించి నోటిఫికేషన్ జారీ కావడం జరిగిందని తెలిపారు.ఆప్రకారం ఉమ్మడి ఉన్నత న్యాయస్థానం విభజన జరిగి ఈయేడాది జనవరి 1వతేదీ నుండి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం విజయవాడ నుండి పనిచేస్తోందని చెప్పారు.కాగా ఈనెల 18వతేదీ నుండి ఉన్నత న్యాయస్థానం నేలపాడులో నిర్మించిన జుడీషియల్ కాంప్లెక్సు భవనం నుండి తన కార్యకలాపాలను ప్రారంభించ నున్ననందున న్యాయమూర్తులు,న్యాయాధికారుల సూచనల మేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు,వసతలను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను సిఎస్ పునేఠ ఆదేశించారు. ముఖ్యంగా కోర్టు హాలులు, న్యామూర్తుల చాంబర్లు,రిజిష్ట్రీలు,ఇతర న్యాయాధికారులు చాంబర్లలో అవసరమైన కంప్యూటర్లు,ఇంటర్నెట్ సౌకర్యం,ఫర్నిచర్ ఇతర సౌకర్యాలు సోమవారం నాటికి పూర్తిగా అందుబాటులో ఉండేలా చూడాలని చెప్పారు.హైకోర్టుకు వసతుల కల్పనకు సంబంధించిన కోఆర్డినేషన్ కమిటీ తరచు సమావేశమై ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తేవాలని ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ ను ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షించాలని సిఎస్ చెప్పారు.
సిఆర్డిఏ కమీషనర్ సిహెచ్ శ్రీధర్ మాట్లాడుతూ నేలపాడులో ఈనెల 18నుండి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం పనిచేయనున్నందున ఇప్పటికే అక్కడ నిర్మించిన జుడీషియల్ కాంప్లెక్సు భవనంలో 12కోర్టులు హాలులు,న్యాయమూర్తులు చాంబర్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.అలాగే 7ఫైలింగ్ సెక్షన్ రూమ్లు,అన్నా క్యాంటీన్ ఉండగా మరో క్యాంటీన్ ఏర్పాటుకు అవసరమైన వసతులు కల్పిస్తున్నామని చెప్పారు.నేలపాడుకు అవసరమైన ఆర్టీసీ బస్సులను నడిపేందుకు వీలుగా ఆర్టీసీ ఉన్నతాధికారులతో సంప్రదించి తగిన బస్సులు ఏర్పాటు చేసేలా ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa