ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శార‌దా పీఠానికి షాక్ ఇచ్చిన టీటీడీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 21, 2025, 12:36 PM

తిరుమ‌ల‌లోని విశాఖ‌ శార‌దా పీఠం టీటీడీ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఒక భ‌వ‌నం నిర్మించారు. ఈ అక్ర‌మ నిర్మాణంపై హిందూ ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ సంఘాలు హైకోర్టును ఆశ్ర‌యించాయి. ఈ విష‌య‌మై విచార‌ణ జ‌రిపిన ఏపీ హైకోర్టు టీటీడీకి అనుకూలంగా తీర్పును వెల్ల‌డించింది. దీంతో ఈ భ‌వ‌నాన్ని టీటీడీ స్వాధీనం చేసుకునేందుకు చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించింది. అక్ర‌మ నిర్మాణాల‌కు సంబంధించి నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తే ఆ నిర్మాణాల‌ను కూల్చి వేయాల‌ని న్యాయ‌స్థానం పేర్కొంది. ఈ తీర్పుతో తాజాగా విశాఖ‌ శార‌దా పీఠం వారు నిర్మించిన మ‌ఠానికి ఈరోజు టీటీడీ నోటీసులు జారీ చేసింది. ప‌దిహేను రోజుల్లోగా మ‌ఠం ఖాళీ చేసి వెళ్లిపోవాల‌ని, అలాగే ఆ భ‌వ‌నాన్ని త‌మ‌కు అప్ప‌గించాల‌ని టీటీడీ ఎస్టేట్ నోటీసుల్లో పేర్కొంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa