కాపు జేఏసీ నేతలతో తెలుగుదేశం పార్టీ కీలక నేత,మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం తమ నివాసంలో భేటీ అయ్యారు. ముద్రగడను టీడీపీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం. ముద్రగడకు టికెట్ ఇచ్చే అంశంపై చర్చలు జరుగుతున్నట్లు తెలియవచ్చింది. కాపు రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన సమయంలో ముద్రగడ.. చంద్రబాబుకు అనుకూలం గా మారినట్లు కనిపించారు. కానీ, ఆ తర్వాత లేఖాస్త్రాలు సంధిస్తూ చంద్రబాబుపై విమర్శలు చేయడం ప్రారంభించా రు. కాగా ముద్రగడ పద్మనాభం ఏ రాజకీయ పార్టీ వైపు ఉంటారనేది ఇప్పటి వరకు తేలలేదు. మరోవైపు ముద్రగడను వైసీపీ వైపు తిప్పుకునేందుకు జగన్ ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. బీసీలను, కాపులను తన వైపు తిప్పుకుంటే విజయం ఖాయమనే ఆలోచనతో జగన్ వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa