కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ లోక్ సభ ఎన్నికల్లో దక్షిణాదిలోనూ పోటీ చేయనున్నారా? అంటే అవునని కాంగ్రెస్ వర్గాల నుంచి పుంఖనాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన ఎప్పుడూ పోటీ చేసే ఉత్తర్ ప్రదేశ్‌లోని అమేథీతో పాటు ఈ సారి ఆయన కర్ణాటక నుంచి కూడా బరిలోకి దిగనున్నారని సమాచారం అందుతోంది. తన ఎన్నికల ప్రచారాన్ని కూడా దక్షిణాది నుంచే ప్రారంభించడం ఈ వార్తలకు మరింత తావిస్తోంది.దక్షిణాది నుంచి పోటీ చేయాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలు, కొందరు సీనియర్ నేతలు రాహుల్ గాంధీని కోరారనట్టు తెలుస్తోంది. . వీరి డిమాండ్లకు తలొగ్గిన రాహుల్ కన్నడ రాష్ట్రంలో పోటీ చేయను న్నారని వార్తలొస్తున్నాయి. గతంలో సోనియా గాంధీ సైతం కర్ణాటకలోని బళ్లారి నుంచి పోటీ చేసి సుష్మా స్వరాజ్‌పై గెలుపొందిన విషయం విదితమే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa