ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వివేకా మృతిపై దర్యాప్తు జ‌ర‌పాలి: ఆదినారాయణ రెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 15, 2019, 09:39 PM

వైఎస్ ఆర్ కాంగ్రెస్ నేత‌ వివేకానంద రెడ్డి  ఆక‌స్మిక మృతి బాధాకరమని ఏపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి  మీడియాకు చెప్పారు. కాంగ్రెస్‌లో త‌న‌తో ఆప్తుడిగా ఉన్న‌. వివేకా మృతిపై లోతైన దర్యాప్తు జరపాల్సిన అవ‌స‌రం ఉంద‌ని  డిమాండ్ చేశారు. తప్పు చేసిన వారిని ఉరి తీసినా తప్పులేదని అన్నారు.  ఈ హ‌త్య వెనుక టిడిపి, త‌న హ‌స్తాలున్నాయంటూ జగన్ చేసిన ఆరోప‌ణ‌లు తిప్పి కొట్టారు. ఆయ‌న‌కి కు ఎప్పుడు తప్పుడు ఆరోపణలు చేయడం అలవాటేనని , నిజాలు బయటకు రాకముందే రవీంద్రనాథ్ రెడ్డి రాజ‌కీయంగా త‌న  లబ్ది కోసం ఆరోప‌ణ‌లు చేసి ప‌డేస్తున్నార‌ని అన్నారు. ఇప్ప‌టికే  వివేకా హ‌త్య‌ని  ఖండిస్తూ.. ఉదయం నేరుగా ఆ ఇంటికి వెళ్లి వివేకా కుటుంబసభ్యులతో మాట్లాడి తన ప్రగాఢ సానుభూతి తెలిపాన‌ని ఓ ప్ర‌శ్న‌కు స‌మాధానంగా చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa