గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో 'పెద్ది' పేరుతో ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న దర్శకుడు బుచ్చిబాబు సానా చాన్నాళ్ల తర్వాత సొంతూరికి వచ్చారు. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి గ్రామంలో ఆయన తన తండ్రి సంవత్సరీకం కార్యక్రమానికి హాజరయ్యారు. ఆచారాల ప్రకారం కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి సంవత్సరీకం క్రతువులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు భారీ ఎత్తున భోజన కార్యక్రమం నిర్వహించారు. బుచ్చిబాబు సానా తండ్రి వెంకట్రావు గతేడాది జూన్ లో మరణించారు. అయితే, తిథి ప్రకారం ఇవాళ సంవత్సరీకం నిర్వహించారు. చాన్నాళ్ల తర్వాత బుచ్చిబాబు సొంతూరికి రావడంతో యు.కొత్తపల్లి గ్రామంలో సందడి నెలకొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa