ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెదేపా తొలి ప్రచార పాటను విడుదల చేసిన చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 15, 2019, 10:47 PM

తెలుగుదేశం అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించిన పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు తొలి ప్రచార పాటను విడుదల చేశారు. ఈ నెల 16 నుంచి తెదేపా రాష్ట్రంలో ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. తెదేపా శ్రేణుల్లో ఉత్సాహం నింపుతూ ప్రచారంలో పాల్గొనేలా ఈ పాట ఆకట్టుకుంటోంది. యూట్యూబ్‌లో ఆప్‌లోడ్‌ చేయగానే మూడువేల మందికి పైగా ఈ పాటను వీక్షించారు. ‘మళ్లీ నువ్వే రావాలి’ అనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా అశ్వనీదత్‌, స్పప్నాదత్‌ నేతృత్వంలో ఈ గీతాన్ని రూపొందించారు. ‘చంద్రుడా రారా.. ఇంద్రుడై రారా ధీరా.. నీ పరిపాలన మాకు వరం..’ అంటూ ప్రారంభమైన ఈ పాటలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తెదేపా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, అమరావతి, ఆంధ్రుల జీవనాడి పోలవరం నిర్మాణాలను వివరించారు. .






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa