తెదేపా కమిటీపై ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అనంతపురం పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలని ఆయన పట్టుపట్టారు. కనీసం ముగ్గురు సిట్టింగులను మారిస్తే తప్ప అనంతపురం లోక్‌సభ స్థానం గెలవలేమని కమిటీకి చెప్పారు. తాను సూచించిన అభ్యర్థులకు టిక్కెట్లు ఇవ్వకుంటే తాను పోటీకి దూరంగా ఉంటానని తెలిపారు. శింగనమల, కల్యాణదుర్గం, గుంతకల్లు ఎమ్మెల్యేలను మార్చాలని జేసీ పట్టుపట్టారు.తెలుగుదేశం పార్టీలో కొంతమంది నాయకులపై అనుమానాలున్నాయని.. స్క్రీనింగ్ కమిటీలో కొందరు మాట్లాడుతున్న మాటలు అసలేమాత్రం తనకు నచ్చలేదని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
స్క్రీనింగ్ కమిటీ సభ్యులతో భేటీ అనంతరం ఆయన ఆగ్రహంగా బయటకు వచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కమిటీ సరైన ఆలోచనలు చేయడం లేదని ,టీడీపీ స్క్రీనింగ్ కమిటీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మూడు సీట్లను మార్చాలని స్క్రీనింగ్ కమిటీకి సూచించానన్నారు. తన సూచనలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారో, లేదో తనకు తెలియదని చెప్పారు. సిట్టింగ్ సభ్యులను మార్చి నా గట్టిగా పోరాడాల్సి ఉంటుందని, సిట్టింగ్‌లను మార్చకపోతే అనంతపురం ఎంపీ సీటులో ఓటమి తప్పదని వ్యాఖ్యానించారు. తాను ఓడిపోయేందుకు సిద్ధంగా లేనన్నారు. పార్టీ మారను గానీ పోటీ చేయాలో, లేదో ఆలోచిస్తానని జేసీ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa