ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మోడీని దించ‌గ‌ల స‌త్తా బాబుదే : కిషోర్ దేవ్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 16, 2019, 05:45 PM

ఈ  దేశంలో విభజించు-పాలించు పరిస్థితి బిజెపి ప్రభుత్వం చేస్తుందని గిరిజనుల యొక్క అటవీ హక్కుల చట్టాన్ని కాలరాస్తుంది అని  మాజీ కేంద్రమంత్రి కిశోర్ చంద్రదేవ్ విమ‌ర్శించారు. శ‌నివారం విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం చిన్న మేరంగి లో టిడిపి ఎమ్మెల్సీ మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు నివాసంలో ఏర్పాటు చేసిన‌ తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్న ఆయ‌న  ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోంద‌ని విమ‌ర్శించారు..  భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని అంటే  నారా చంద్రబాబునాయుడు తోనే మాత్రమే సాధ్యమని భావించి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగిందని చెప్పారు కిషోర్‌.
కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన చట్టంలోని హామీలను అమలు పరచటంలో విఫలం అయిందని. తిరుపతి సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన మోడీ మాట తప్పారని అన్నారు.  నల్లధనం వెలికి తీసి ఒక కుటుంబానికి 15 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ప్రజలను బ్యాంకుల చుట్టూ తిప్పారని తన దాచుకున్న డబ్బులు కూడా ప్రజలు ఉన్నారని విమ‌ర్శించారు. 
మన రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న వైసిపి పార్టీ కేంద్రంలో ఎవరికి ఇస్తుందో తెలియని పరిస్థితుల్లో ఉందని దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమ పథకాలు మన ముఖ్యమంత్రి ప్రవేశపెట్టారని కిషోర్ అన్నారు. సంక్షేమ పథకాలన్నీ సక్రమంగా అమలు జరగాలంటే మరొక్కసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్ప‌ష్టం చేసారు.  కురుపాం MLA ; అరుకు MP తెలుగు దేశం పార్టీ అభ్యర్థులు లను అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో కురుపాం నియోజకవర్గం ఐదు మండలాల నుండి కన్వీనర్ లో తెలుగుదేశం పార్టీ ఎంపిటిసిలు సర్పంచ్లు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa