ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహోన్నత వ్యక్తి పొట్టి శ్రీరాములు : శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె.నివాస్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 16, 2019, 05:53 PM

మహాత్మాగాంధీ బోధించిన సత్యం, అహింస , హరిజనోద్ధరణ అనే ఆశయాల కొరకు జీవితాంతం కృషిచేసిన మహోన్నత వ్యక్తి అని పొట్టి శ్రీరాములు అని శ్రీకాకుళం  జిల్లా కలెక్టర్ జె.నివాస్ కొనియాడారు. మార్చి 16 పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా శనివారం ఉదయం స్థానిక పాతబస్టాండ్ వద్ద గల పొట్టి శ్రీరాములు విగ్రహానికి కలెక్టర్ పూలమాలను వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్రులందరికీ పొట్టి శ్రీరాములు ఆదర్శప్రాయుడని, ఆయన బాటలో ప్రతీ ఒక్క ఆంధ్రుడు నడవాలని జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. అటువంటి మహానుభావుడను ప్రతీ ఒక్కరూ గుర్తుచేసుకోవాలని, ఆయన అందించిన స్పూర్తితో ప్రతీ ఒక్కరూ ముందుకుసాగాలని అభిప్రాయపడ్డారు.
మద్రాసు రాజధానిగా ఉండే సమయంలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి చివరకు ప్రాణాలను అర్పించి అమరజీవియైన మహాపురుషుడు పొట్టి శ్రీరాములు అని అన్నారు. ఆంధ్రులకు ప్రాత: భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైనాడని కొనియాడారు. మహాత్మాగాంధీ బోధించిన సత్యం, అహింస , హరిజనోద్ధరణ అనే ఆశయాల కొరకు జీవితాంతం కృషిచేసిన మహోన్నత వ్యక్తి అని గుర్తుచేసారు. సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొన్నారని చెప్పారు. ఆయన చేసిన కృషికి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందని , దీన్ని ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలని కోరారు. అంతేకాకుండా ఆయన ఆశయాల సాధనకు ప్రతీ ఒక్కరూ కృషిచేయాలని కలెక్టర్ ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమీషనర్ ఆర్.శ్రీరాములు నాయుడు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa