ఎలక్షన్ లలో నగదు ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సంఘం ఆదేశాల మేరకుపోలీసుల తనిఖీలు ముమ్మరమవుతున్నాయి. కడపి జిల్లా పోరుమామిళ్లలో ఓ వ్యక్తి నుంచి రూ.99 వేలు నగదుకు సంబంధించి ఆధారాలు చూపక పోవటంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోరుమామిళ్ల మండలం మార్కాపురంలో శనివారం పోలీసు తనిఖీలు నిర్వహిస్తుండగా.. హైదరాబాద్ నుండి పోరుమామిళ్ళకు వస్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో అదిబోయిన శ్రీనివాసులు అనే వ్యక్తి వద్ద రూ.99 వేలు నగదు ఒకే మొత్తంగా ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఎలాంటి రశీదులు లేని ఆ నగదును స్వాధీనం చేసుకొని కడప ఇన్‌కమ్‌టాక్స్ డిపార్ట్‌మెంట్ కు అప్పగిస్తామని కలసపాడు ఎస్‌ఐ ప్రదీప్ నాయుడు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa