ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జ‌న‌సేన నుంచి బిజెపిలోకి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 16, 2019, 06:03 PM

బిజెపి రాష్ట్ర కార్యదర్శి  కునిగిరి నీలకంఠ  ఆధ్వర్యంలో బిజెపిలోకి ప‌లువురు చేసారు. శ‌నివారం ఆదోనిలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో  జనసేన జిల్లా కో-కన్వీనర్ రమాకాంత్ తో పాటు 250 మంది కి కునిగిరి నీలకంఠ   పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా  పార్టీలో చేరిన‌ రమాకాంత్ మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి దీక్ష ,పట్టుదల చూసి వారికి ఆకర్షితులై భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగిందని మన ఆదోని అభివృద్ధి చెందాలంటే అటువంటి నాయకత్వంలో గల పార్టీ అవసరమని ఆ పార్టీ నుంచి వచ్చిన మచ్చ లేని నాయకుడు, ప్రజల కొరకు పోరాడే   నీలకంఠ   నాయకత్వం లో ప‌ని చేస్తామ‌న్నారు.  


  కునిగిరి నీలకంఠ   మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు 70 సంవత్సరాల పాలనలో ఏ నాయకుడు చేయలేదని మన ఆదోనిలో లో  వాటాల‌ని పంచుకొని దౌర్జన్య పూరిత రాజకీయాలు చేసేటువంటి నాయకులకు మనం స్వస్తి పలకేందుకు ఓటు మనకు ఉన్న ఏకైక ఆయుధమని దీనిని స‌రిగా ఉప‌యోగించాల‌ని పిలుపునిచ్చారు. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa