ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లేకుంటే స్వ‌తంత్ర అభ్య‌ర్ధినే : భూమా బ్రహ్మానంద

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 16, 2019, 06:09 PM

టీడీపీ   తొలిజాబితాలో చోటు ద‌క్క‌ని నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్ర‌హ్మానంద రెడ్డి  ఈ సీటు పెండింగ్‌లో పెట్టడంపై అస‌హ‌నం వ్య‌క్తం చేసారు.  శనివారం మధ్యాహ్నం.. నంద్యాలలో కార్యకర్తలతో బ్రహ్మానందరెడ్డి అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నంద్యాల టికెట్ తప్పకుండా తనకే వస్తుందన్నారు. టికెట్‌ రాకుంటే టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు, దివంగత నేత భూమా నాగిరెడ్డి ఫొటోలతో ఇండింపెండెంట్‌గా పోటీ చేస్తానని నంద్యాల ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి తేల్చిచెప్పారు. 


 ఇదివరకే నంద్యాల టికెట్ విషయమై అఖిల మాట్లాడుతూ కచ్చితంగా నంద్యాల టికెట్ మాదేనని,  రెండో జాబితాలో కచ్చితంగా భూమా బ్రహ్మానందరెడ్డి  పేరు ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈసారి నంద్యాల టికెట్ తనకివ్వాలని ఏవీ సుబ్బారెడ్డి.. తన అల్లుడికే నంద్యాల టికెట్ ఇవ్వాలని ఎంపీ ఎస్పీవై రెడ్డి అధిష్టానాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. అయితే రెండో జాబితాలో నంద్యాల పేరు ఉంటుందా..? ఉంటే అభ్యర్థి ఎవరు..? అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa