ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పార్లమెంటు ఎన్నికలకు 18 న‌ నోటిఫికేషన్ : సీఈఓ రజత్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 16, 2019, 07:51 PM

పార్లమెంటు ఎన్నికలకు తుది ఓటర్ల జాబితా ఫిబ్రవరి 22 లోపు విడుదల చేశామని, మార్చి18 నాడు నోటిఫికేషన్ ఇస్తున్నామన్నారు.  సచివాలయంలో సీఈఓ రజత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ మొత్తం 2.95 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, నిన్నటి వరకు ఫామ్ 6 తీసుకున్నామ‌ని, ఇంకా కొన్ని పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. దీంతో ఓటర్ల సంఖ్య 3 కోట్ల వరకు పెరిగే అవకాశం ఉంది. మార్పులు, చేర్పులు ఇవన్నీ 25 తేదీ వరకు పరిశీలించి తుది జాబితా విడుదల చేస్తామన్నారు. బీ ఎల్ ఓ లు 28 వ తేదీ నుండి ఓటర్ స్లిప్ లు పంపిణీ చేస్తారు. బ్యాలెట్ యూనిట్స్ 54953 , కంట్రోల్ యూనిట్స్  40038 , 41356 వీవీ ఫ్యాట్ లు ఉన్నాయని తెలిపారు. 43801 ప్రిసైడింగ్ అధికారులు, 88 వేల 806 ఇతర ఉద్యోగులు, మైక్రో ఆబ్జార్వర్లు 9541 మొత్తం 1 లక్షా 85 వేల 500 మంది పోలింగ్ విధులు నిర్వహిస్తున్నారు. మోడల్ కోడ్ ఉల్లంఘన కింద రూ.2 కోట్ల 76 లక్షల 70 వేల సీజ్ అయ్యాయని అన్నారు. 4770 లీటర్ల లిక్కర్ రూ.1 కోటి విలువ గల మారకద్రవ్యాలు సీజ్ అయిందన్నారు. ఎన్నికల ఏర్పాట్లు పూర్తి అయ్యాయ‌ని, ఈవీఎం లు  రెండు కంపెనీల‌ ప్రభుత్వ రంగ సంస్థలు సప్లై చేస్తున్నా ర‌ని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa