వైసీపీ నాయకుడు వైస్ వివేకానంద రెడ్డి మృతిపై వినిపిస్తున్న మాటలు ఎంతో నీచంగా ఉన్నాయని, ఆయన హత్యను ఖండించాల్సింది పోయి జుగుప్సాకరంగా మాట్లాడుతున్నారని మంచు విష్ణు విమర్శించారు. వివేకా అంకుల్ మరణాన్ని కూడా రాజకీయంగా వాడుకుంటున్నారని..ఇంత నీచానికి దిగజారడం ఎందుకని మంచు విష్టు ప్రశ్నించారు. వివేకానంద కుటుంబానికి మంచు విష్ణుకు బంధుత్వం ఉన్న సంగతి తెలిసిందే. కాగా విష్ణు భార్య విరానికా దివంగత వైఎస్సార్ సోదరుడి కుమార్తె. దీంతో మంచు ప్యామిలీకి, వైఎస్ ప్యామిలీకి మధ్య వియ్యం ఏర్పడింది. అయితే శుక్రవారం దారుణహత్యకు గురైన వివేకా పట్ల మంచు చలించి పోయాడు. తండ్రితో కలిసి వివేకా భౌతికకాయాన్ని సందర్శించిన విష్ణు విషాదానికి లోనయ్యాడు. అనంతరం, తన స్పందనను ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. వివేకా హత్య తర్వాత జరుగుతున్న పరిణామాలపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంచు విష్ణు, కొందరి మాటలు వింటుంటే మానవత్వం మురికి కాలువల్లో కొట్టుకుపోతున్న భావన కలుగుతోందని అన్నాడు. కనీస ఆలోచన కూడా లేకుండా మాట్లాడు తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వీళ్లకు అసలు ఆవగింజతైనా బుర్ర ఉందా, మరణాన్ని సైతం రాజకీయాలకు ఉపయోగించు కుంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. అంతకుముందు, మోహన్ బాబు కూడా ఈ విషయంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకా ఎంతో మంచివాడని ఇతర రాజకీయపార్టీల వాళ్లే చెబుతుంటారని, అలాంటి వ్యక్తిని చంపాల్సిన కారణం ఏంటని ప్రశ్నించారు. జరుగు తున్న ఘోరాలను పై నుంచి భగవంతుడు గమనిస్తూనే ఉంటాడని మోహన్ బాబు వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa