బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా ఎన్డీయే కూటమి తరపున పాకా వెంకట సత్యనారాయణను ఎంపిక చేసింది. ఈ సందర్భంగా ఆయన మంగళవారం విజయవాడలో నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు పార్టీ కార్యాలయానికి చేరుకున్న ఆయనకు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, సోము వీర్రాజు, పార్ధసారధి, ఇతర నేతలు శాలువాలతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా పాకా మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలుగా తాను బీజేపీలో పని చేస్తున్నానని, బీజేపీ పట్టణ అధ్యక్షుడి నుంచి రాష్ట్ర నేతగా ఎదిగానని, డ్రాప్టింగ్ కమిటీ ఛైర్మన్‌గా, కేంద్ర మంత్రుల బృందానికి కన్వీనర్‌గా, క్రమశిక్షణ సంఘం కమిటీ ఛైర్మన్‌గా పని చేశానని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa