ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాక్‌ను మరోసారి చావుదెబ్బ తీసిన చైనా రాడార్లు

international |  Suryaa Desk  | Published : Wed, May 07, 2025, 09:20 PM

చైనా వస్తువులు అంటే యూజ్ అండ్ త్రో అని మనకు తెలిసిందే. ప్లాస్టిక్ వస్తువుల దగ్గరి నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు అన్నింటినీ తక్కువ ధరలో తయారు చేస్తున్న చైనా.. ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తోంది. అయితే తక్కువ ధరకు రావడంతో అంతా కొనుగోలు చేసి వాడేసుకుంటున్నారు. కానీ.. చైనా వస్తువులు ఎప్పుడు మొరాయిస్తాయో ఎవరూ చెప్పలేరు. ఇక ఒక్కసారి అవి రిపేర్ వచ్చాయంటే వాటిని వదిలించుకోవడమే మంచిది అని చెబుతారు. అయితే పాకిస్తాన్ మాత్రం అదే చైనా వస్తువులపై ఆధారపడి.. దెబ్బ మీద దెబ్బ తింటోంది. ఇక కీలకమైన రాడార్ల విషయంలో చైనా వస్తువులు ఫెయిల్ కావడం.. పాకిస్తాన్‌కు గట్టి ఎదురుదెబ్బగా మారాయి. గతంలో భారత్ దాడి చేసిన సమయంలో పాకిస్తాన్‌ను అలర్ట్ చేయాల్సిన చైనా రాడార్లు విఫలం కాగా.. తాజాగా ఆపరేషన్ సిందూర్ సమయంలో కూడా భారత్ దాడులను పసిగట్టడంలో మరోసారి ఫెయిల్ అయ్యాయి.


పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా "ఆపరేషన్ సిందూర్" అమలు చేసింది. పాక్‌లోకి వెళ్లి 25 నిమిషాల్లోనే 9 ఉగ్రస్థావరాలపై దాడులు చేసి 70 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. పాకిస్తాన్‌లోని 4, పీఓకేలోని 5 టార్గెట్లను ఛేదించాయి. అయితే నిఘా వర్గాల నివేదికల ప్రకారం.. చైనా తయారు చేసిన పాక్ రాడార్ సిస్టమ్స్ భారత ఫైటర్ జెట్స్ ఎటు నుంచి వస్తున్నాయో కనిపెట్టలేకపోయాయని తెలుస్తోంది. ఇలా పాక్ డిఫెన్స్ సిస్టమ్.. భారత దాడులను గుర్తించకపోవడం ఇదేం తొలిసారి కాదు. 2019లో బాలాకోట్‌పై ఎయిర్ స్ట్రైక్ చేసినప్పుడు కూడా పాక్ రక్షణ సిస్టమ్స్ భారత దాడులను అస్సలు గుర్తించలేకపోయాయి. ఈ రెండు ఘటనలతో పాక్ టెక్నాలజీ మీద ఆ దేశ ప్రజలకే పూర్తిగా నమ్మకం పోయింది.


ఇక 2022లో మరో సంఘటన చోటు చేసుకుంది. హర్యానాలోని అంబాలా నుంచి ఒక బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ లాంచ్ అయింది. ఆ మిస్సైల్ మన గగనతలంలో 100 కిలోమీటర్లు, పాకిస్తాన్ భూభాగంలో మరో 105 కిలోమీటర్లు ప్రయాణించి పంజాబ్‌లోని మియాన్ వద్ద పడిపోయింది. మిస్సైల్ పడిన తర్వాత పాకిస్తాన్ ఆర్మీ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదో చెప్పింది కానీ.. వాళ్ల రాడార్లు ఫెయిల్ అయ్యాయని అప్పుడే అందరికీ అర్థం అయింది.


పాకిస్తాన్‌కు చైనా ఇచ్చిన LY-80 LOMADS అనే రక్షణ సిస్టమ్స్‌లో ఇప్పటికే 388 లోపాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. వాటిలో 103 కొత్తగా కనిపెట్టినవి కాగా.. మరో 285 లోపాలు గతంలో చెప్పినవే కావడం గమనార్హం. ఇందులో 255 లోపాలను అర్జెంటుగా సరిచేయాలని నిపుణులు ఇప్పటికే హెచ్చరించారు. ఇక ఈ డిఫెన్స్ సిస్టమ్ లోని లోపాలని సరిచేయకుంటే.. భవిష్యత్‌లో పాకిస్తాన్‌కు వాళ్ల గగనతలాన్ని కాపాడుకోవడమే పెద్ద టాస్క్ కానున్నట్లు చెబుతున్నారు.


2015 నుంచి 2019 మధ్య పాకిస్తాన్‌కు చైనా ఈ LY-80 డిఫెన్స్ సిస్టమ్స్‌ను ఇచ్చింది. కానీ వాటిలో చాలా సమస్యలు 96వ రెజిమెంట్‌కు చెందిన వాటిలోనే ఉన్నాయని సమాచారం. దీనికి ప్రధాన కారణం ఏంటంటే.. స్పేర్ పార్ట్స్ లేకపోవడం, చైనా నుంచి సరైన టెక్నికల్ సపోర్ట్ రాకపోవడమే అని సంబంధిత వర్గాలు పేర్కొంటన్నాయి. ఈ పరిణామాలతో పాకిస్తాన్ మరింత ఇబ్బందుల్లో పడుతోంది.


LY-80 సిస్టమ్స్ 15 మీటర్ల నుంచి 18 కిలోమీటర్ల ఎత్తులో, 40 కిలోమీటర్ల దూరం వరకు టార్గెట్లను చూడగలవని గొప్పలు చెప్పుకుంటారు. కానీ మన సూపర్ సోనిక్, హైపర్ సోనిక్ బాలిస్టిక్ మిస్సైల్స్ దాదాపు కనిపించకుండానే దాడి చేయగలవు. అవి చాలా స్పీడ్‌గా, ఎక్కువ ఎత్తులో వెళ్తుండటంతో పాక్ రాడార్లు వాటిని టైమ్‌కి గుర్తించలేకపోతున్నాయి. ఇది వాళ్ల గాలి రక్షణ సిస్టమ్స్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. పాక్ రక్షణ సిస్టమ్స్ పదే పదే ఫెయిల్ అవ్వడం, చైనా టెక్నాలజీ మీద పూర్తిగా ఆధారపడటం వల్ల వచ్చే డేంజర్స్ ఇప్పుడు ప్రపంచమంతా మాట్లాడుకుంటున్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఈ లోపాల మీద గట్టిగా రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నా.. ఇప్పటివరకు పాక్ గవర్నమెంట్ ఎలాంటి అఫీషియల్ డీటెయిల్స్ చెప్పకపోవడం విశేషం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa