కృష్ణాజిల్లా నూజివీడు ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న చంద్రబాబు. సభ లో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం.పెన్షన్లు పెంచాం. పసుపు కుంకుమతో అక్కా చెల్లెళ్ళకు అండగా ఉన్నాం చంద్రబాబు నాయుడు అన్నారు. వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే జైలు పాలవుతారన్నారు. గతంలోనే తండ్రి అధికారం అడ్డుపెట్టుకొని పారిశ్రామిక వేత్తలను, అధికారులను జైలుపాలు చేసి, ఆయన పదహారు నెలలు జైలు జీవితం గడిపిన జగన్ అంటే పారిశ్రామిక వేత్తలు భయపడి చేస్తున్నారన్నారు.
పారిశ్రామిక వేత్తలు, విదేశీ పెట్టుబడులు రాకపోతే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమేనా అని ప్రశ్నించారు. నేను రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని, అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలని కష్టపడుతుంటే జగన్మోహన్ రెడ్డి పెట్టుబడిదారులను బెదిరిస్తున్నారని, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేక పోతున్నారని మండిపడ్డారు. కేంద్రం సహకరించకపోయినా రాజధానిని, మరోపక్క నదుల అనుసంధానం, పోలవరాన్ని పూర్తి చేస్తుంటే జగన్ మోహన్ రెడ్డి పోలవరానికి అడ్డం పడతాడు, రాజధానిని విమర్శిస్తాడు, పట్టిసీమను ఒట్టిసీమ అంటున్నాడు. నేను ఇలాంటి విమర్శలకు, బెదిరింపులకు భయపడను.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa