ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహమ్మద్ యూనస్ రాజీనామాకు కారాణాలు ఇవేేనటా

international |  Suryaa Desk  | Published : Sat, May 24, 2025, 08:52 PM

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహమ్మద్ యూనస్ బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈయన తాజాగా రాజీనామా చేయబోతున్నట్లు పెద్ద ఎత్తున టాక్ నడుస్తోంది. అలాగే బంగ్లాదేశ్ అధికార పగ్గాలు ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్ చేతుల్లోకి వెళ్లనున్నాయనే ఊహాగానాలు కూడా జోరుగా సాగుతున్నాయి. ఈ సమయంలోనే అసలు యూనస్ ఎందుకు రాజీనామా చేయాలనుకుంటున్నారని పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ముఖ్యంగా ఓ ఐదు కారణాల వల్లే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


1. బంగ్లాదేశ్ రాజకీయ పార్టీలకు ఏకాభిప్రాయం లేదు..!


బంగ్లాదేశ్‌లోని రాజకీయ పార్టీలు తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని సర్కారుకు సహకారం అందించడం లేదు. షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయినప్పటి నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ముఖ్యంగా 2026 జూన్ నెలలో ఎన్నికల నిర్వహిస్తామని యూనస్ చెప్పగా.. అన్ని పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇలా తాత్కాలిక ప్రభుత్వానికి పార్టీల మద్దతు లేకపోవడంతో దేశంలో అనిశ్చితి ఏర్పడే పరిస్థితులు నెలకొన్నాయి.


2. ఏ పార్టీ ప్రభుత్వానికి మద్దతివ్వడం లేదు..!


మాజీ ప్రధాని ఖలీదా జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ (BNP) ప్రస్తుతం ప్రధాన రాజకీయ శక్తిగా మారింది. అవామీ లీగ్‌పై నిషేధం విధించిన తర్వాత..బీఎన్పీ దశలవారీగా వేలాది మంది అనుచరులతో కలసి ఎన్నికలు జరపాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టింది. మరోవైపు నేషనల్ కన్సర్వేటివ్ పార్టీ (NCP) మరియు కొన్ని ఇస్లామిక్ గుంపులు మాత్రం యూనస్ ప్రవేశ పెట్టిన సంస్కరణల అమలు తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని చెబుతున్నాయి.


3. డిసెంబరులో ఎన్నికలు జరపాలని ఆర్మీ చీఫ్ అల్టిమేటం..!


ఇటీవల కాలంలో బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్ ఉజ్-జమాన్.. నౌకాదళ, వైమానిక దళ అధిపతులతో కలిసి యూనస్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగానే ఎన్నికలు 2025 డిసెంబరులోనే జరపాలని తాత్కాలిక ప్రభుత్వాన్ని కోరారు. అందుకు సర్కారు ఒప్పుకోలేదు. దీంతో జనరల్ జమాన్ ధాకాలోని కంటోన్మెంట్‌లో ఉన్న ఉన్నతాధికారులతో సమావేశం అయి అనేక విషయాలపై చర్చించారు. దీంతో వీరి మధ్య ఉన్న వివాదాలు బయటకు పొక్కాయి. అప్పటి నుంచే బంగ్లాలో రాజకీయ సంక్షోభం ఏర్పడబోతున్నట్లు ఊహాగానాలు ఏర్పడుతున్నాయి.


4. రఖైన్ కారిడార్‌పై యూనస్ యూ-టర్న్..!


మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రంలో "మానవతా దారిద్య్ర కారిడార్" ఏర్పాటుకు సంబంధించి యూనస్ తీసుకున్న నిర్ణయాన్ని జనరల్ జమాన్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నిర్ణయం బంగ్లాదేశ్ సార్వభౌమత్వాన్ని క్షీణింపజేస్తుందని.. ఇది అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాల కోసమేనని విమర్శలు చేశారు. ముఖ్యంగా బంగ్లాదేశ్ ఆర్మీ.. దేశసార్వభౌమత్వానికి హానికరం అయిన ఏ చర్యలోనూ భాగం కాదని.. అలాంటి చర్యలను ఎప్పటికీ అనుమతించబోదని తేల్చి చెప్పారు. యునైటెడ్ నేషన్స్ ప్రతిపాదించిన కారిడార్‌ను విదేశాంగ సలహాదారు తౌహిద్ హోసేన్ యూనిలేటరల్‌గా మంజూరు చేసిన తర్వాత ఈ వివాదం మొదలైంది.


5. సైనిక వ్యవహారాల్లో యూనస్ జోక్యం..


తాత్కాలిక ప్రభుత్వానిధినేతగా మహమ్మద్ యూనర్ బాధ్యతలు చేపట్టిన తొలి నాళ్లలో.. జనరల్ జమాన్ పూర్తి మద్దతు ప్రకటించారు. ముఖ్యంగా న్యాయవ్యవస్థ, పోలీస్ మరియు ఆర్థిక వ్యవస్థల్లో సంస్కరణలకు అన్ని రకాలుగా సాయం చేశారు. కానీ దేశంలో రాజకీయ అస్థిరత పెరగడంతో, సంస్కరణలు కుదరకపోవడంతో జమాన్ వైఖరి మారింది. 2025 డిసెంబరులోగా ఎన్నికలు నిర్వహించాలని ఆయన స్పష్టంగా డిమాండ్ చేశారు. 2026 వరకు ఎన్నికలు వాయిదా వేయాలన్న ప్రతిపాదనను ఆయన తిరస్కరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa