చోరీకి గురైన మొబైల్ ఫోన్ తిరిగి రెండేళ్ల తర్వాత దాని యజమాని వద్దకే చేరుకుంది. అతడి ఇంటికే నేరుగా కొరియర్ ద్వారా రావడంతో అతడు షాకయ్యాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో చోటుచేసుకుంది. దేశవ్యాప్తంగా రోజూ కోట్లాది పార్సిళ్లు డెలివరీ అవుతుంటాయి. అందులో కొన్ని పోలీస్ స్టేషన్లు వెళ్తుంటాయి. పోగొట్టుకున్న, చోరీకి గురైన ఫోన్లు తిరిగి పంపుతోన్న వ్యక్తుల నుంచి వచ్చే పార్శిళ్లే ఇవి. కాగా, జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాకు చెందిన ఓ 35 ఏళ్ల వ్యక్తి ఆరు నెలల కిందట స్థానిక దుకాణంలో ‘డిస్కౌంట్ ధరకు’ ఫోన్ కొనుగోలు చేశారు. సాధారణంగా ఫోన్లు కొనేవాళ్లకు అది ఎలా పనిచేస్తుంది.. ఫీచర్లు ఏంటి అని చూస్తారు తప్ప మిగతా విషయాలను పట్టించుకోరు. పుల్వామా వ్యక్తి కూడా నెట్‌వర్క్ సిగ్నల్ బాగుందా? బ్యాటరీ లైఫ్ ఎలా ఉంది? ఇవి చూసిన తర్వాత మొబైల్ కొన్నాడు.
కానీ, నెల రోజుల తర్వాత అతడికి ఊహించని షాక్ తగిలింది. అది ఉత్తర్ ప్రదేశ్‌లోని ఘాజీయాబాద్‌కు చెందిన రంజిత్ ఝా అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఫోన్ అని తెలిసింది. రంజిత్ 2023 అక్టోబర్ 16న ఆ ఫోన్‌ను పోగొట్టుకున్నారు. ఆ రోజు ఉదయం ఘాజీయాబాద్‌లోని తన ఇంటి నుంచి ఢిల్లీకి ఇంటర్వ్యూకు రంజిత్ బయలుదేరాడు , రైల్వే స్టేషన్‌కి వెళ్లేందుకు ఆటో ఎక్కి ఫోన్ చేతిలో ఉంచుకున్నాడు. కానీ, ఇంటర్వ్యూ గురించే ఆలోచిస్తూ, ఫోన్ గురించి మరిచిపోయాడు. స్టేషన్‌కు చేరుకున్న తర్వాత కౌంటర్ వద్దకు వెళ్లి టిక్కెట్ తీసుకుని.. డబ్బులు చెల్లించే సమయంలో ఫోన్ లేదని గుర్తించాడు. దీంతో వెంటనే పోలీసులకు అతడు ఫిర్యాదు చేశాడు.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలి-కమ్యూనికేషన్ విభాగం.. ఐఎంఈఐ నెంబరు ఆధారంగా ఫోన్లను ట్రాక్ చేసే సీఈఐఆర్ (CEIR – Central Equipment Identity Register) పోర్టల్‌లో ఫిర్యాదు నమోదుచేశాడు. దీంతో 2024 మార్చిలో, IMEI ట్రాకింగ్ ద్వారా ఝా ఫోన్‌ను గుర్తించారు. అది జమ్మూ కశ్మీర్ నంబర్‌తో వాడుతున్నట్టు ఘాజీయాబాద్ పోలీసులకు సమాచారం చేరింది. ఈ క్రమంలో పోలీసులు పుల్వామా నివాసితుడికి ఫోన్ చేసి ‘దొంగిలించిన ఫోన్ మీరు వాడుతున్నారు’ అని చెప్పడంతో అతడు షాకయ్యాడు. అయితే, తాను మా ఊరి దుకాణంలో కొన్నానని, బిల్లు కూడా ఉందని పోలీసులకు చెప్పాడు. ఆ తర్వాత స్థానిక పోలీసులను సంప్రదించి నిజం తెలుసుకున్నాక ఫోన్‌ను కొరియర్ ద్వారా తిరిగి 2025లో పంపించాడు.
ఘాజీయాబాద్‌కు చెందిన బినోద్ కుమార్ గుప్తా ఫోన్ 2023 ఆగస్టులో తన మొబైల్ పోగొట్టుకున్నాడు. కుషాంబి నుంచి లాల్ కువాన్‌కు బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో అతడు నిద్రపోయాడు. కొద్దిసేపటికి లేచిచూసేసరికి దొంగలు చేతివాటం ప్రదర్శించారు. అప్పటికే ఆశలు వదిలేసిన గుప్తా, ఏప్రిల్ 13, 2024న తన ఫోన్ తిరిగి వచ్చిందన్న వార్తతో ఆశ్చర్యపోయాడు. బఠిండాలో ఓ వ్యక్తి వాడుతున్నట్టు గుర్తించారు. అతడి సోదరుడు 2023 డిసెంబర్‌లో ఢిల్లీకి వచ్చి ఫోన్‌ను కొనుగోలు చేశాడు. ఘాజీయాబాద్ పోలీసులు సంప్రదించాక అది దొంగతనం చేసిన ఫోన్ అని గ్రహించి వెబ్‌సైట్ ద్వారా అధికారిని ధ్రువీకరించి, కుటుంబ సలహాతో ఫోన్ తిరిగి పంపించారు.
ఈ తరహాలో దేశవ్యాప్తంగా 70 మందికి చెందిన ఫోన్లను ఘాజీయాబాద్ పోలీసులకు తిరిగి అప్పగించారు. కాగా సీఈఐఆర్ వల్ల పోగొట్టుకున్న, చోరీకి గురైన ఫోన్ ట్రాకింగ్ మెరుగుపడింది అయితే IMEI నంబర్ లేకపోతే ఇది వర్క్ చేయదు. కానీ, లక్షల ఫోన్లు IMEI నెంబరుతోనే దర్జాగా వాడుకుంటున్నారు. 2023 మే16 నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 50 లక్షల పైగా ఫోన్ల వివరాలు CEIRలో నమోదు అయ్యాయి. వీటిలో: 31 లక్షల ఫోన్లు బ్లాక్ అయ్యాయి, 19 లక్షల ఫోన్లు ట్రేస్ అయ్యాయి.
వాస్తవంగా రికవర్ అయిన ఫోన్లు మాత్రం 4.22 లక్షలు మాత్రమే
రాష్ట్రాల వారీగా రికవరీ
ఉత్తరప్రదేశ్: 1.7 లక్షల ఫోన్లు బ్లాక్, 1.1 లక్షలు ట్రేస్, 27,537 రికవరీ
ఢిల్లీ: 7.7 లక్షలు బ్లాక్, 4.6 లక్షలు ట్రేస్, 8,951 రికవరీ
తెలంగాణ: 1.8 లక్షలు ట్రేస్, 78,842 రికవరీ
కర్ణాటక: 2 లక్షలు ట్రేస్, 78,507 రికవరీ
రాజస్థాన్: 65,368 ట్రేస్, 26,498 రికవరీ
ఆంధ్రప్రదేశ్: 67,454 ట్రేస్, 24,198 రికవరీ
తమిళనాడు: 77,564 ట్రేస్, 25,852 రికవరీ
గుజరాత్: 56,589 ట్రేస్, 21,211 రికవరీ
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa