గన్నవరం వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి కోర్టులో నిరాశ తప్పలేదు. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో బెయిల్ కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను నూజివీడు కోర్టు సోమవారం తిరస్కరించింది. ఈ కేసులో అరెస్టైన వంశీ ప్రస్తుతం విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
సోమవారం ఉదయం వంశీ అస్వస్థతకు గురవడంతో ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో బెయిల్ పిటిషన్‌పై న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేస్తూ, బెయిల్‌ను కొట్టివేశారు.
వంశీపై నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీతో పాటు, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి, కిడ్నాప్, అక్రమ మైనింగ్, భూ కబ్జా వంటి బహుళ ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసుల్లో ఆయన రిమాండ్‌లో ఉంటూ, బెయిల్ కోసం పలుమార్లు ప్రయత్నించినప్పటికీ, కోర్టు నుంచి ఊరట లభించడం లేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa