ఆగస్టు 1, 2025 నుంచి యూపీఐ (UPI) యాప్ ద్వారా వినియోగదారులు తమ బ్యాంక్ ఖాతా బ్యాలెన్స్‌ను రోజుకు 50 సార్లు మాత్రమే పరిశీలించుకోవచ్చు. ఈ కొత్త నిబంధనను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. బ్యాంకులు మరియు యూపీఐ సేవల సంస్థలకు ఈ మేరకు ఆదేశాలు అందాయి.
అంతేకాకుండా, విజయవంతమైన లావాదేవీల సమాచారంతో పాటు ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ వివరాలను కూడా వినియోగదారులకు తప్పనిసరిగా పంపాలని NPCI బ్యాంకులకు సూచించింది. ఈ నిబంధనలు యూపీఐ వినియోగంలో పారదర్శకతను పెంచడం, సాంకేతిక ఒత్తిడిని నియంత్రించడం కోసం తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
ఈ మార్పుల వల్ల యూపీఐ వినియోగదారులు తమ బ్యాంక్ బ్యాలెన్స్‌ను తనిఖీ చేసే విధానంలో పరిమితులు ఎదుర్కొనవచ్చు, కాబట్టి రోజువారీ లావాదేవీలను ప్లాన్ చేసుకోవడంలో జాగ్రత్తగా ఉండాలని సూచన.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa