ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేసీఆర్‌ పెత్తనం ఆంధ్రాకు అవసరమా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 22, 2019, 11:46 PM

‘‘వైఎస్‌ వివేకా హత్య వాళ్ల ఇంట్లోనే జరిగింది.. అయినా నాటకాలు ఆడారు. కారు డ్రైవర్‌ చంపినట్లు ఓ లేఖ సృష్టించారు. డ్రైవర్‌పై నెపం వేసి తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నించారని మిమ‌ర్శించారు చంద్ర‌బాబు.  విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం సబ్బవరంలో శుక్ర‌వారం నిర్వహించిన ఎన్నికల ప్రచార రోడ్‌షోలో చంద్రబాబు మాట్లాడుతూ. మృతదేహాలకు సైతం కట్లు కట్టేవారిని ఏమనాలి? ఈ రాష్ట్రంలో రౌడీ రాజ్యం తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. నేను ఉన్నంతకాలం రౌడీరాజ్యం రానివ్వను. జగన్‌పై ఉన్న కేసుల గురించి విశాఖ లోక్‌సభ జనసేన అభ్యర్థి మాజీ జేడీ లక్ష్మీనారాయణ చెప్పాలి. భర్త ఒక పార్టీ.. భార్య మరో పార్టీ.. ఎవరిని మోసం చేస్తారు? వైకాపా ఫ్యాన్‌.. మోదీ, కేసీఆర్‌ చేతుల్లో ఉంది. ఫారం-7 దరఖాస్తు దొంగలను వదిలిపెట్టేది లేదు. ఏపీలో తిరిగేందుకు ఫ్యాన్‌కు అర్హత లేదు. కేసీఆర్‌ పెత్తనం ఆంధ్రాకు అవసరమా?’’ అని చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa