ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అభివృద్ధి అంటే ఏంటో చూపించాం…

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 22, 2019, 11:46 PM

విశాఖలో మెడ్‌టెక్‌ జోన్‌ వస్తోంది. దీంతో 20వేల ఉద్యోగాలు వస్తాయి.  సబ్బవరంను విద్యాకేంద్రంగా తయారు చేస్తాం. అన్నారు చంద్ర‌బాబు  విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం సబ్బవరంలో శుక్ర‌వారం నిర్వహించిన ఎన్నికల ప్రచార రోడ్‌షోలో చంద్రబాబు మాట్లాడుతూ  ఉద్యోగులు కోరినట్లు 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చాం.  ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 ఏళ్లకు పెంచాం. అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించాం.. భవిష్యత్తులో మరింత చేస్తాం. మనపై అందరూ గద్దల్లా వాలుతున్నారు. కేసీఆర్‌, జగన్‌ కలిసి నాటకాలు ఆడుతున్నారు. దేశంలో విశ్వసనీయత మనకే ఉంది. కేసీఆర్‌ మాటకారే తప్ప.. చేష్టల్లో ఏమీ లేదు. వీరంతా మోడీ చేతి కీలుబొమ్మ‌లే అని ఎద్దేవా చేసారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa