ఓ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయిని, మరో మహిళా టీచర్ మధ్య వార్ నడిచింది. ఈ క్రమంలో ఆ టీచర్ స్కూల్ ప్రధానోపాధ్యాయినిపై అసభ్యకరమైన మెసేజ్‌లతో వేధించారు.. తప్పుడు ప్రచారం చేశారు. ఈ క్రమంలో బాధితురాలు పోలీసుల్ని ఆశ్రయించడంతో ఈ స్టోరీ మొత్తం బయటపడింది.. దర్యాప్తులో ఆ టీచర్ గురించి సంచలన విషయాలు బయటపడ్డాయి. ఏలూరు జిల్లాలోని ఓ జెడ్పీ ప్రభుత్వ హైస్కూల్‌లో ప్రధానోపాధ్యాయిని పనిచేస్తున్నారు. ఆ స్కూల్‌లో టీచర్లు అకారణంగా సెలవులు పెట్టొద్దని.. స్కూల్‌లో, క్లాస్ రూమ్‌లలో ఉన్న సమయంలో మొబైల్స్ వినియోగించొద్దని ఆదేశించారు.
ఈ క్రమంలో అదే స్కూల్లో పనిచేస్తున్న లేడీ టీచర్ ప్రధానోపాధ్యాయినిపై కక్ష పెంచుకున్నారు. ఆమెను ఎలాగైనా అల్లరి చేయాలని ప్లాన్ చేశారు. వెంటనే తన ఇంట్లో పనులు చేసే మనిషి పేరుతో ఓ సిమ్ కొనుగోలు చేశారు.. స్కూల్ ప్రధానోపాధ్యాయినిపై బంధువులు, కుటుంబ సభ్యులతో పాటుగా తోటి టీచర్లకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపారు. ఈ మెసేజ్‌ల విషయం తెలియడంతో ప్రధానోపాధ్యాయిని మనస్తాపానికి గురయ్యారు.. తనపై తప్పుడు ప్రచారం జరగడంతో ఆమె బాధపడ్డారు. వెంటనే ఏలూరు సైబర్ క్రైం పోలీసుస్టేషన్‌లో ఈ మెసేజ్‌ల అంశంపై ఫిర్యాదు చేశారు.. వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు.. కేసును మహిళా పోలీసుస్టేషన్‌కు పంపారు.
వాట్సాప్ మెసేజ్‌లు పెడుతున్న వ్యక్తి ఎవరో కనుగొనేందుకు స్కూల్‌కు వెళ్లి ఆరా తీశారు. చివరకు అదే స్కూల్లో పనిచేస్తున్న మహిళా టీచర్ ఈ నేరం చేసినట్లు గుర్తించారు. ఆమెపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అలాగే ఆ మహిళా టీచర్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డీఈవోకు పోలీసులు లేఖ రాశారు. అలాగే స్కూల్‌లో లేడీ టీచర్‌కు మరికొందరు సహకరించినట్లు తెలిసిందని.. విచారణ జరిపిన తర్వాత వారిపైనా చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.. ఇద్దరు ప్రభుత్వ టీచర్ల మధ్య మొదలైన చిన్న వార్ ఇలా కేసుల వరకు వెళ్లింది. ఒక ప్రభుత్వ స్కూల్‌లో ఇలాంటి ఘటన జరగడం చర్చనీయాంశం అయ్యింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa