ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కడుపు మాడ్చుకోకుండానే పది కిలోల బరువు తగ్గొచ్చు

Life style |  Suryaa Desk  | Published : Thu, Jun 05, 2025, 12:20 AM

వెయిట్ లాస్. చాలా మందికి ఇదో కల. ఆహారపు అలవాట్లు కావచ్చు. ఫ్యామిలీ హిస్టరీ అయ్యుండొచ్చు. కొంత మంది అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు. ఒకప్పుడంటే అవగాహన లేక లైట్ తీసుకునే వాళ్లు. కానీ..ఇప్పుడలా కాదు. బరువు తగ్గేందుకు రకరకాల మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. ఎవరికి నచ్చిన ప్రాసెస్ వాళ్లు ఫాలో అవుతున్నారు. వీటిలో కొన్ని బాగానే వర్కౌట్ అవుతాయి. ఇంకొన్ని పెద్దగా ఫలితాలు ఇవ్వవు. అయితే..సరైన విధంగా బరువు తగ్గడానికి కొన్ని పద్ధతులుంటాయి. అలాంటి వాటిలో ఒకటే ఇప్పుడు చెప్పుకోబోయే వెయిట్ లాస్ టిప్. పైగా ఇది ఓ హెల్త్ ఎక్స్ పర్ట్ రికమెండ్ చేశారు. తక్కువ టైమ్ లోనే పది కిలోల బరువు తగ్గొచ్చు అని చెప్పారు. నోరు కట్టేసుకునే పని లేకుండానే వెయిట్ లాస్ అయ్యే విధంగా 7 రోజుల డైట్ ప్లాన్ షేర్ చేశారు. దీన్ని సరిగ్గా ఫాలో అయితే చాలా సులభంగా బరువు తగ్గుతారని వివరిస్తున్నారు హెల్త్ ఎక్స్ పర్ట్ నేహ. రామ్‌దేవ్ బాబా చెప్పిన అదిరే చిట్కాలు, రెగ్యులర్‌గా ఫాలో అయితే కీళ్లలో పేరుకుపోయిన యూరిక్ యాసిడ్ మూత్రం ద్వారా బయటకు వచ్చేస్తుంది


అన్నం తింటూనే


సాధారణంగా బరువు తగ్గాలనుకునే వాళ్లు చేసే మొట్టమొదటి పని అన్నం తినడం మానేయడం. అన్నం అతిగా తింటే బరువు పెరిగిపోతారని, అందుకే అవాయిడ్ చేయాలని అనుకుంటారు. ఇందులో నిజం లేకపోలేదు. కానీ.. ఇప్పుడు హెల్త్ ఎక్స్ పర్ట్ నేహ చెప్పిన వెయిట్ లాస్ ప్లాన్ మాత్రం అందుకు కాస్త భిన్నంగా ఉంటుంది. అన్నం తింటూ కూడా బరువు తగ్గొచ్చు అని చెబుతున్నారు. ఆ విధంగానే ప్లాన్ రెడీ చేశారు. మొత్తం 7 రోజుల పాటు ఏ టైమ్ లో ఏం తినాలో చాలా క్లియర్ గా ఓ షీట్స్ రూపంలో వివరాలు షేర్ చేశారు. ఆమె చెప్పిన ప్లాన్ ని సరైన విధంగా ఫాలో అయితే రెండు నెలల్లో సుమారు 10 కిలోల వరకూ తగ్గొచ్చు.


7 రోజుల డైట్ ప్లాన్


ఈ 7 రోజుల డైట్ ప్లాన్ లో భాగంగా మొదటి రోజు ఉదయం పరగడుపున వాము నీళ్లు తాగాలి. దీంతో పాటు కొన్ని నట్స్ తీసుకోవాలి. వాము వాటర్ తాగితే జీర్ణ శక్తి పెరుగుతుంది. నట్స్ ద్వారా శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. ఇక బ్రేక్ ఫాస్ట్ లో నల్ల శనగలు తీసుకోవాలి. ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా త్వరగా జీర్ణం అవుతాయి. పైగా మలబద్ధకాన్ని తగ్గిస్తాయి. త్వరగా కడుపు నిండిపోవడం వల్ల అనారోగ్యకరమైన ఆకలి వేయదు.


ఆ తరవాత ఓ గంట గ్యాప్ ఇచ్చి ఓ అరటి పండు తినాలి. ఇక లంచ్ లో అన్నం, ఏదైనా ఓ కూర, పెరుగుతో తినాలి. దీంతో పాటు కొంచెం సలాడ్ కూడా తీసుకుంటే మంచిది. స్నాక్స్ టైమ్ లో ఆయిల్ ఫుడ్స్ పూర్తిగా పక్కన పెట్టాలి. వాటి బదులుగా మజ్జిగ తాగాలి. రాత్రి పూట ఉడికించిన మొలకలు తినాలి. అక్కడితో తినడం ఆపేయాలి. నిద్రపోయే ముందు కొన్ని గోరు వెచ్చని నీళ్లు తీసుకోవాలి.


ఎక్స్ పర్ట్ చెప్పిన డైట్ ప్లాన్


తరవాత ఏం చేయాలంటే


ఇక రెండో రోజు ఉదయం జీరా వాటర్ తీసుకోవాలి. దీంతో పాటు కొన్ని నట్స్ తినాలి. బ్రేక్ ఫాస్ట్ కి పనీర్ రవ్వ ఉప్మా తినాలి. ఆ తరవాత ఓ జామకాయ తీసుకోవాలి. లంచ్ లో బీట్ రూట్ పులావ్ ని కీరదోసకాయతో చేసిన రైతతో తినాలి. స్నాక్స్ లో మొలకెత్తిన విత్తనాలు తీసుకోవాలి. డిన్నర్ లో క్వినోవాతో తయారు చేసిన దోశలు పల్లీ చట్నీతో తినాలి. పడుకునే ముందు గోరు వెచ్చని నీళ్లు తాగాలి. మూడో రోజు పరగడుపున కొత్తినీర నీళ్లు తాగాలి. నట్స్ తినాలి. బ్రేక్ ఫాస్ట్ కి మిలెట్ దోశ, కాసేపయ్యాక అరటి పండు తినాలి. లంచ్ లో రసం రైస్, పెరుగు తీసుకోవాలి. స్నాక్స్ లో బ్రెజిల్ నట్స్ తింటే మంచిది. లేదా అందుబాటులో ఉండే వేరే ఏవైనా నట్స్ తినాలి. డిన్నర్ లో రాగి మాల్ట్ తీసుకోవాలి. జీలకర్ర టీ తాగి పడుకోవాలి.


మిగతా రోజుల ప్లాన్


నాలుగో రోజు వాము నీళ్లు, నట్స్ తీసుకోవాలి. బ్రేక్ ఫాస్ట్ లో రాజ్ మా తినాలి. ఆ తరవాత ఓ జామకాయ తింటే మంచిది. లంచ్ లో పప్పన్నం, ఆనియన్ రైతా తీసుకోవాలి. ఈవినింగ్ స్నాక్స్ టైమ్ లో బటర్ మిల్క్ డిన్నర్ లో గ్రిల్డ్ పనీర్, ఉడికించిన పప్పు కూరగాయలు తినాలి. రాత్రి పడుకునే ముందు గ్రీన్ టీ తాగాలి. ఐదో రోజు మెంతులు కలిపిన నీళ్లు తాగాలి. బ్రేక్ ఫాస్ట్ కి మిలెట్ మాల్ట్ తీసుకోవాలి. తరవాత యాపిల్ తినాలి. లంచ్ లో జీరా రైస్, పప్పు తీసుకోవాలని హెల్త్ ఎక్స్ పర్ట్ నేహ చెప్పారు. స్నాక్స్ లో అవిసె గింజల లడ్డు తినాలి. డిన్నర్ లో వెజిటబుల్ సలాడ్ తీసుకోవాలి.


చివరి రెండు రోజులు


ఆరో రోజు ఉదయమే మెంతి వాటర్, లంచ్ కి అన్నం పాలకూర పప్పు, డిన్నర్ కి మిలెట్ పులావ్, పప్పు తినాలి. ఏడో రోజు ఉదయమే సోంపు వాటర్ తీసుకోవాలి. లంచ్ లో పనీర్ బిర్యాని, స్నాక్స్ లో స్ప్రౌట్స్ తినాలి. ఇక డిన్నర్ లో మిలెట్ ఉప్మా తింటే మంచిది. రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చని నీళ్లు తీసుకోవాలి. ఇలా 7 రోజుల పాటు డైట్ ఫాలో అయితే రెండు నెలల్లో పది కిలోల బరువు తగ్గొచ్చు అని నేహ వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa