వైఎస్ జగన్ ద్వారా ఆంధ్రా ఆస్తులపై తెలంగాణ సీఎం కేసీఆర్ కన్నేశారని తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఆ కుట్రను చూస్తూ ఊరుకోబోమని స్పష్టంచేశారు. తెలంగాణలో డిక్టేటర్ మాదిరి తయారైన కేసీఆర్.. ఆంధ్రాను జగన్ ద్వారా డిక్టేట్ చేయడానికి చూస్తున్నారని దుయ్యబట్టారు. ఈ మేరకు పార్టీ నేతలతో ఆయన శనివారం ఉదయం ఉండవల్లిలోని తమ నివాసం నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కేసుల మాఫీ కోసం రాష్ట్రాన్ని జగన్ కేసీఆర్‌కు అమ్మేస్తున్నాడనే భావన ప్రజల్లో బలపడుతోందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ బ్రాండ్ చెడగొడుతూ ప్రతి ఒక్కరూ ఛీకొట్టే పరిస్థితికి కేసీఆర్ తెస్తున్నారని దుయ్యబట్టారు. మోదీ, కేసీఆర్, జగన్ ఏపీపై పెత్తనం చేస్తామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరని, ఓటుతో గట్టి గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఆనాడు అన్యాయంగా రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్‌పై ఎంత కోపం, కసి ప్రజలు చూపారో.. ఇప్పుడు వైకాపాపై అంతే ఆగ్రహంతో ఉన్నారని చంద్రబాబు అన్నారు. జగన్‌ది సైకో మనస్తత్వం అని చంద్రబాబు విమర్శించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa