దేశంలో ఏ వ్యక్తి దాఖలు చేయని విధంగా . రాష్ట్రంలో అతిపెద్ద అఫిడవిట్‌ను జగన్ దాఖలు చేశారని, 31 కేసుల్లో నిందితుడిగా, ఇన్ని నేరాలతో ఇంకెవ్వరూ అఫిడవిట్ దాఖలు చేయరని ఎద్దేవాచేశారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. శనివారం ఆయన మీడియాలో మాట్లాడుతూ.... అవినీతి రహిత పాలన అందిస్తానని చెపుతు, తమ మీద బురద జల్లాలలని చూస్తున్న జగన్ అఫిడవిట్ చాలు ప్రజలు ఎందుకు ఓటు వేయకూడదనేందుకు అని వ్యాఖ్యానించారు. జగన్ ఒత్తిడితోనే వివేకానందరెడ్డి కూతురు కూడా తండ్రి చావుని రాజకీయం చేసే పరిస్థితికి వచ్చారని, పులివంఎందులకు కూడా నీళ్లు రావటంతో ఓటమి అంచున ఉన్నట్టు భావించే, వివేక హత్యతో ఓట్లు రాబట్టుకోవాలన్నది జగన్ తత్వంగా అభిప్రాయపడ్డారు తెలుగుదేశం సభల్లో ప్రజల ఉత్సాహం ఉరకలేస్తోందని, అంతటా తెదేపా పట్ల సానుకూలత కనిపిస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa