ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోడి కత్తి పార్టీ పై అప్రమత్తత అవసరం : మంత్రి దేవినేని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 23, 2019, 11:41 PM

మైలవరం నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల్లో వార్ వన్ సైడే ఉంటుందని తెలుగుదేశం పార్టీ జెండా మరోసారి విజయకేతనంగా ఎగురుతుందని తెదేపా మైల‌వ‌రం అభ్య‌ర్థి దేవినేని ఉమామహేశ్వర రావు ప్రకటించారు. శనివారం నాడు పైడురుపాడు,  రాయనపాడు గ్రామాలలో జరిగిన ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా ఉరకలు వేస్తూ పాల్గొన్నారు. వేలాదిగా గ్రామ ప్రజలు అడుగడుగున మంత్రి దేవినేని ఉమా కు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి ఉమా మాట్లాడుతూ మైలవరంలో వారు వన్ సైడే అయినా కోడి కత్తి పార్టీ పట్ల కార్యకర్తలు నాయకులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు. కొండదిగని కొంగర మల్లయ్య, ఆయన కొడుకు కొంగర పుల్లయ్యల వల్ల మైలవరం నియోజకవర్గానికి ఒరిగేది ఏమీ లేదని తేల్చి చెప్పారు. చేసిన అభివృద్ధిని చూడమని గ్రామాలలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు అండగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కృష్ణానదిపై పవిత్ర సంగమం దగ్గర నిర్మిస్తున్న ప్రపంచంలోనే ఎత్తయిన కూచిపూడి ఐకానిక్ బ్రిడ్జి, దాములూరు వద్ద నిర్మిస్తున్న దాములూరు – వైకుంఠపురం బ్యారేజీ, మెట్ట రైతుల సిరుల పంటగా భాసిల్లుతున్న చింతలపూడి ఎత్తిపోతల పథకంతో మైలవరం నియోజకవర్గ రూపురేఖలు అద్భుతంగాను, చారిత్రాత్మకంగాను మారబోతున్నట్లు చెప్పారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa