ఒంగోలు జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గ తె.దే.పా అసెంబ్లీ అభ్యర్థిగా బి.ఎన్ విజయ్ కుమార్ ను ఎంపిక చేయడంతో ఆ నియోజకవర్గ తె.దే.పా కార్యకర్తలు,నాయకులలో అసమ్మతి నెలకొంది.ఇదే విషయమై వారు పలుమార్లు చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్లి అభ్యర్థిని మార్చాలని లేకపోతే పార్టీని వీడేందుకు సిద్ధమని హెచ్చిరించారు కూడా. ఈక్రమంలోనే శనివారం సుజనా చౌదరి ఆధ్వర్యంలో ఒంగోలు లోని బృందావన్ గార్డెన్స్ లో వారిని బుజ్జగించే ప్రయత్నం గా సమావేశం జరిగింది. సుజనాచౌదరి తె.దే.పా కార్యకర్తలకు మరియు నాయకులకు సర్దిచెపుతూ, ఎలాంటి సర్వేల ఆధారంగా విజయ్ కుమార్ కు టిక్కట్ ఇచ్చామో చేప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు,ఏం.పి మాల్యాద్రి,జిల్లా పార్టీ అధ్యక్షుడు దామచర్ల జనార్థన్, గొట్టిపాటి రామకృష్ణ,దివి శివరాం, పమిడి వెంకట్రావు, మన్నం ప్రసాద్, మాదాల రమేష్, బొడ్డు సుబ్బారావు, మండవ రంగారావు, జయంత్ బాబు, వీర రాఘవులు పాల్గొనగా మొదటినుండి విజయకుమార్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న నాగులుప్పల పాడు ఏం.పి.టీ.సి ముప్పవరపు వీరయ్య చౌదరి హాజరు కాకపోవడం విశేషం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa